ETV Bharat / sitara

షారుక్​ను కాపాడే పాత్రలో సల్మాన్! - షారుక్​ను కాపాడే పాత్రాలో సల్మాన్!

బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్ హీరోగా 'పఠాన్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్​గా మారింది.

Salman Khan role in Pathan Movie
సల్మాన్, షారుక్
author img

By

Published : May 26, 2021, 10:36 AM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్‌ కథానాయకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 'పఠాన్‌' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా.. ప్రస్తుతం తుదిదశ చిత్రీకరణలో ఉంది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో హీరో సల్మాన్‌ ఖాన్‌ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నాడు. ఇందులో సల్మాన్.. షారుక్ స్నేహితుడిగా టైగర్‌ పాత్రలో దర్శనమివ్వనున్నారని తాజా సమాచారం.

ఓ విభిన్నమైన యాక్షన్‌ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో షారుక్​కి ఒక రష్యన్‌ గన్‌ మాఫియాకి ఓ భారీ పోరాట ఘట్టం ఉంది. ఆ ఎపిసోడ్‌లోనే షారుక్​ని రక్షించే స్నేహితుడిగా సల్మాన్‌ పాత్ర తెరకు పరిచయం కానుందట. దాదాపు 20నిమిషాల పాటు ఆయన తెరపై సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు సినిమాలో ఆయన పరిచయ సన్నివేశాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించేలా ఉంటాయని చిత్ర సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

ఈ చిత్ర క్లైమాక్స్‌ను దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహంలపై దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో చిత్రీకరించారు. ఇప్పటికే 70శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన చిత్రీకరణను రష్యాలో పూర్తి చేయాల్సి ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేయగానే చిత్రబృందం అక్కడికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.