సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం బాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదీ నటుడు. తాజాగా నటి జరీన్ ఖాన్ చేసిన వ్యాఖ్య చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ తనను పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
అసలు విషయం ఏంటటే..
ఇటీవలే ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా జరీన్‌ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లింది. "మీపై మీరే ఓ రూమర్ క్రియేట్ చేసుకోవాలి.. ఆ రూమర్ చాలా వైరల్ అవ్వాలి" అని విలేకరి చెప్పగా.. ఇందుకు జరీన్ "సల్మాన్ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు" అంటూ వ్యాఖ్యానించింది.
"నాపై వచ్చే ఇలాంటి రూమర్స్ చాలా సరదాగా ఉంటాయి. నాకు పెళ్లిపై నమ్మకం లేదు. ఈ మధ్య కాలంలో పెళ్లనేది ఓ జోక్‌గా మారిపోయింది' అని తెలిపింది.
ఇదీ చూడండి: 'సాహో' ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం