ETV Bharat / sitara

చిరు సినిమాలో సల్మాన్​.. డేట్స్​ ఫిక్స్​! - సల్మాన్​ ఖాన్​

Salmankhan chiranjeevi movie: చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న 'గాడ్​ఫాదర్'​ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​ వారం రోజుల పాటు డేట్స్​ను కేటాయించారని తెలిసింది. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్​ను పూర్తిచేయాలని చిత్రబృందం భావిస్తోందట.

chiru salman god father
చిరు సల్మాన్​ ఖాన్​ గాడ్​ఫాదర్​
author img

By

Published : Jan 11, 2022, 7:34 PM IST

Salmankhan chiranjeevi movie: అగ్ర కథానాయకుడు చిరంజీవి వరుస సినిమాలతో జోరుమీదున్నారు. ఆయన కీలక పాత్రలో మోహన్‌రాజా తెరకెక్కిన పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ 'గాడ్‌ ఫాదర్‌'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్‌'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా, ఇందులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మాతృకలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రను తెలుగులో సల్మాన్‌ చేస్తుండటం విశేషం.

కాగా, త్వరలోనే ఈ చిత్ర సెట్స్‌లోకి సల్మాన్‌ అడుగుపెట్టనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. కరోనా కారణంగా ఆయన నటిస్తున్న 'టైగర్‌3' చిత్రీకరణ వాయిదా పడింది. దీంతో ఆ డేట్స్‌ను 'గాడ్‌ఫాదర్‌' కోసం కేటాయించనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌. ఐదు నుంచి ఏడు రోజుల పాటు సల్మాన్‌ షూటింగ్‌లో పాల్గొంటారట. సినిమా చిత్రీకరణలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించకుండా ఉంటే వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. 'గాడ్‌ఫాదర్‌'లో చిరంజీవి, నయనతార, సత్యదేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌.

ఇదీ చూడండి: 'పుష్ప: ది రూల్'​ కోసం స్క్రిప్ట్​లో మార్పులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.