ETV Bharat / sitara

సల్మాన్ భాయ్ ముగించేశాడు - రాధే చిత్రీకరణ పూర్తి

అగ్ర కథానాయకుడు సల్మాన్​ఖాన్​ 'రాధే' చిత్రీకరణ బుధవారంతో పూర్తయ్యింది. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశముంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు.

Salman Khan announces 'wrap on Radhe' shooting schedule
సల్మాన్​ కొత్తచిత్రం 'రాధే' షూటింగ్​ షెడ్యూల్​ పూర్తి
author img

By

Published : Oct 14, 2020, 9:11 PM IST

అన్​లాక్ ప్రక్రియలో భాగంగా కొన్నాళ్ల క్రితం ప్రారంభమైన సల్మాన్​ఖాన్​ 'రాధే' షూటింగ్​.. బుధవారంతో(అక్టోబరు 14)​ పూర్తయ్యింది. దీనికి సంబంధించిన ఓ​ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్​మీడియాలో పంచుకుంది. వీడియోలో భాగంగా కారులో నుంచి దిగిన సల్మాన్​.. 'వ్రాప్​'(పూర్తయ్యింది) అని మైక్​లో ప్రకటించాడు. దీంతో చిత్రబృందమంతా చప్పట్లతో తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్​పై రూపొందిన ఈ యాక్షన్​ చిత్రం.. ఈ ఏడాది రంజాన్​ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ, లాక్​డౌన్​ వల్ల అదికాస్త వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ పూర్తవ్వడం వల్ల త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

ఇందులో సల్మాన్ సరసన దిశా పటానీ నటిస్తుండగా.. జాకీ ష్రాఫ్​, రణదీప్​ హుడాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకుడితో ఇంతకు ముందు 'వాంటెడ్', 'రెడీ', 'దబంగ్ 3' సినిమాల్లో నటించారు సల్మాన్.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.