మేకప్ విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? సహజంగా కనిపించడానికి మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి..?
సాయి పల్లవి: మేకప్‌కు నేను చాలా దూరం. మేకప్ వేసుకుంటే నేను నాలా ఉండను. ఒకట్రెండు సార్లు దర్శకులు "మేకప్ వేసుకుని చూడు" అన్నారు. వేసుకుంటే.. వాళ్లకే నచ్చలేదు. అందుకే అలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. త్రిష, సిమ్రన్‌లను చూస్తూ పెరిగాను. వాళ్ల అందం, గ్లామర్ నాకు లేవు. జార్జియాలో ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు ఆత్మన్యూనత భావంతో ఉండేదాన్ని. అక్కడవాళ్లంతా నాకంటే తెల్లగా ఉండేవాళ్లు. నా మొహం నిండా మొటిమలే. వాళ్లేం అనుకుంటారో అనే భావనతో ఉండేదాన్ని. క్రమంగా నన్ను నేను స్వీకరించడం మొదలెట్టా. నా తొలి సినిమా విడుదల రోజున నాకంతా టెన్షనే. ప్రేక్షకులు నన్ను చూసి ఏమనుకుంటారు? త్రిష, సిమ్రన్‌లను చూసిన కళ్లతో నన్ను చూస్తారా? అనిపించింది. కానీ వాళ్లు నాలో రంగునీ, మొటిమల్నీ చూడలేదు. నేను ఎలా ఉంటే అలానే ఇష్టపడ్డారు. నాలా చాలామంది అమ్మాయిలు రంగు గురించో, అందం గురించో బెంగ పెట్టుకుంటూ ఉంటారు. అవన్నీ వదిలేయండి. మీ వ్యక్తిత్వం, మీరు చేసే పని, అందులో మీరు నిమగ్నమయ్యే తీరు ఇవే ముఖ్యం. వాటి గురించే ఆలోచించండి. మిగతావి వదిలేయండి.
ఇవీ చూడండి.. అట్టహాసంగా 'లైవ్ లెజెండ్స్' సంగీత విభావరి