'సాహో' సినిమా కోసం రెండేళ్ల నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ అభిమానులు. ఎట్టకేలకు ఆగస్టు 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఈ నెలంతా ప్రమోషన్లలో పాల్గొననున్నాడు ప్రభాస్. దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నాడు రెబల్ స్టార్.
ఈ నెల 12న ఓ థియేటర్లో టీజర్‌ను విడుదల చేయనున్నారు. 18న ముందస్తు విడుదల వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి రామోజీ ఫిల్మ్‌సిటీ వేదిక కానుంది.
ఇప్పటికే సాహోకు పోటీ రాకుండా తమ సినిమాలు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. ఇందుకు ప్రభాస్ ధన్యవాదాలు కూడా తెలిపాడు.
"సాహో ఆగస్టు 30న విడుదల కాబోతుంది. మా చిత్రానికి పోటీ రాకుండా తమ సినిమాలు వాయిదా వేసుకున్న నిర్మాతలందరికీ ధన్యవాదాలు. సాహోకు మార్గాన్నిచ్చి మీరు తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞుడిని" -ప్రభాస్, హీరో
నితీశ్ తివారి తెరకెక్కించిన 'చిచ్చోరే' చిత్రాన్ని మొదట ఆగస్టు 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే సాహో కోసం ఓ వారం పాటు వాయిదా వేశారు. సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. రాజ్‌కుమార్‌రావ్ 'మేడ్ ఇన్ చైనా'.. సూర్య హీరోగా తెరకెక్కిన 'బందోబస్త్' సినిమాల విడుదల తేదీని కొంత కాలం పొడిగించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: తమిళ క్వీన్‌కు సెన్సార్ కష్టాలు..!