ETV Bharat / sports

బ్రూక్ ట్రిపుల్, రూట్ డబుల్ సెంచరీ - పాకిస్థాన్ పై రెచ్చిపోయిన ఇంగ్లాండ్ బ్యాటర్లు!

పాకిస్థాన్​పై తొలి టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ - భారీ స్కోర్ దిశగా ఇంగ్లీష్ టీమ్​

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Harry Brook
Harry Brook (Associated Press)

Harry Brook England Vs Pakistan 1st Test : ముల్తాన్ వేదికగా పాకిస్థాన్​తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్​ పరుగుల వరద పారిస్తోంది. ఆ జట్టు స్టార్ ప్లేయర్స్ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగిపోగా, మరో జో రూట్ డబుల్ సెంచరీతో విజృంభించారు. దీంతో ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​ను 823 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హ్యారీ బ్రూక్ 322 బంతుల్లో 317 పరుగులు సాధించాడు. 29 ఫోర్లు, మూడు సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అలాగే జో రూట్ 375 బంతుల్లో 262 పరుగులు బాదాడు. అందులో 17 ఫోర్లు ఉన్నాయి.

రెండో బ్యాటర్​గా రికార్డు
బ్రూక్‌ తన ట్రిపుల్‌ సెంచరీని 310 బంతుల్లో పూర్తి చేశాడు. దీంతో ఫాస్టెస్ట్ ట్రిపుల్ హండ్రెడ్ చేసిన రెండో ప్లేయర్​గా ఘనత సాధించాడు. టెస్టుల్లో ఫాస్టెస్ట్‌ ట్రిపుల్‌ సెంచరీ రికార్డు టీమ్​ఇండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్‌ పేరిట ఉంది. సెహ్వాగ్‌ 2008లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్​లో 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదాడు.

మరిన్ని రికార్డులు బద్దలు
ముల్తాన్ వేదికగా పాక్​పై జో రూట్ డబుల్ సెంచరీ బాదటం వల్ల ఇంగ్లాండ్ తరఫున అత్యధిక 250+ స్కోరు చేసిన మూడో బ్యాటర్​గా నిలిచాడు. పాక్​పై ఈ మార్క్​ను తాకిన రెండో అంతర్జాతీయ బ్యాటర్​గా ఘనత సాధించాడు. అలాగే ఈ రికార్డు సాధించిన తొలి ఇంగ్లాండ్​ ప్లేయర్​గానూ చరిత్రకెక్కాడు. అయితే పాకి పై సెహ్వాగ్‌ తోపాటు రూట్ కూడా రెండోసారి 250+ పరుగులు చేశాడు.

రికార్డు భాగస్వామ్యం
జో రూట్-హ్యారీ బ్రూక్ నాలుగో వికెట్‌ కు ఏకంగా 454 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో రూట్-బ్రూక్ టెస్టు క్రికెట్‌ లో నాలుగో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసిన జోడీగా నిలిచారు. ఈ జాబితాలో శ్రీలంక జోడీ కుమార సంగక్కర-మహేల జయవర్ధనే (624 పరుగులు), జయసూర్య-మహనామా (576 పరుగులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. మూడో స్థానంలో న్యూజిలాండ్‌ కు చెందిన మార్టిన్ క్రోవ్-ఆండ్రూ జోన్స్ (467 పరుగులు) ఉన్నారు.

ఆరో ప్లేయర్​గా బ్రూక్ రికార్డు
ఇక ట్రిపుల్ సెంచరీ సాధించిన హ్యారీ బ్రూక్ పలు వ్యక్తిగత రికార్డులు నమోదు చేశాడు. ఇంగ్లాండ్​ తరఫున ట్రిపుల్ సెంచరీ బాదిన ఆరో ప్లేయర్​గా రికార్డు సాధించాడు. అతడి కంటే ముందు లియోనార్డ్ హట్టన్ (364), వాలీ హమ్మండ్ (336*), గ్రాహమ్ గూచ్ (333), ఆండీ సాందమ్ (325), జాన్ ఎడ్రిచ్ (310*) ఈ ఘనత అందుకున్నారు.

ముల్తాన్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టులో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి 556 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ హ్యారీ బ్రూక్ ట్రిపుల్ సెంచరీ, జో రూట్ డబుల్ సెంచరీ బాదటం వల్ల భారీ స్కోరు చేసింది. 7 వికెట్ల నష్టానికి 823 పరుగుల చేసి తొలి ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 267 పరుగుల ఆధిక్యంలో ఉంది.

WTCలో రూట్ హవా- కెరీర్​లో మరో మైల్​స్టోన్- సచిన్​ రికార్డుకు అతి చేరువలో - Joe Root WTC

'ఫ్యాబ్ ఫోర్'లో ఎక్కువ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'లు ఎవరు సాధించారంటే? - Fab 4 Most Player Of The Series

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.