డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో'.. బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వారంలో రూ.370 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా..ఇప్పుడు మరో ఘనతను సాధించింది. యూఎస్‌లో 3 మిలియన్ డాలర్ల క్లబ్లో చేరిన ఐదో తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో బాహుబలి-2(12 మిలియన్ డాలర్లు) టాప్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో బాహుబలి(6.9 మిలియన్ డాలర్లు), రంగస్థలం(3.5 మిలయన్ డాలర్లు), భరత్ అనే నేను(3.4 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.
'సాహో'లో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించింది. అరుణ్ విజయ్, జాకీష్రాఫ్, మందిరాబేడీ, మహేశ్ మంజ్రేకర్, చుంకీ పాండే తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జిబ్రాన్ నేపథ్య సంగీతమందించాడు. సుజీత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించింది.
ఇది చదవండి: సాహో ప్రపంచ రికార్డ్... కలెక్షన్స్‌లో నంబర్ 2