ETV Bharat / sitara

'సుశాంత్​ కేసును ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు?'

సుశాంత్​ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసుల జాప్యంపై బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ పాండే అసహనం వ్యక్తం చేశారు. నటుడి బ్యాంకు​ లావాదేవీల ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయట్లేదని ప్రశ్నించారు.

Rs 50 cr withdrawn from Sushant's account, Mumbai Police silent: Bihar DGP
'సుశాంత్​ కేసును ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేదు'
author img

By

Published : Aug 4, 2020, 1:18 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ రాజ్​పుత్​ కేసులో ముంబయి పోలీసులు విచారణ చేస్తున్న తీరుపై బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ పాండే మండిపడ్డారు. దర్యాప్తును హీరో బ్యాంక్ లావాదేవీల ఆధారంగా ఎందుకు విచారణ జరపట్లేదని ముంబయి పోలీసులను ప్రశ్నించారు.

అలా దర్యాప్తు చేయండి

"నాలుగేళ్లుగా సుశాంత్ బ్యాంకు​ ఖాతాలో రూ. 50 కోట్లు జమయ్యాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఆ డబ్బంతా విత్‌డ్రా అయ్యింది. ఒకే ఏడాది సుశాంత్​ ఖాతాలో అత్యధికంగా రూ.17 కోట్ల జమ అవ్వగా.. అందులో రూ.15 కోట్లు విత్​డ్రా అయ్యాయి. దర్యాప్తులో ఇదే కీలకమైన అంశం. దీనిపై ముంబయి పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడం లేదు" అని బిహార్​ డీజీపీ గుప్తేశ్వర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆమె నిందితురాలు

సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తికి ఈ కేసులో పాత్ర ఉందని.. ఫిర్యాదు నమోదైన కారణంగా ఆమె నిందతురాలని డీజీపీ గుప్తేశ్వర్​ తెలిపారు. "రియా ఈ కేసులో నిందితురాలు. మేం ఆ సాక్ష్యాలను సేకరిస్తున్నాం. అవి దొరికిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తాం. అయితే దర్యాప్తును పారదర్శకంగా జరుపుతాం. మరిన్ని సాక్ష్యాలు, నిజాలు తెలుసుకోవడంలో భాగంగా మా పోలీసు అధికారులు ముంబయిలో ఉన్నారు" అని గుప్తేశ్వర్​ వెల్లడించారు.

బిహార్​ సీఎం స్పందన

ముంబయి పోలీసులు కేసును త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని భావించిన సుశాంత్ తండ్రి కేకే సింగ్.. పట్నా పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీక‌రించిన బిహార్ పోలీసులు అనేక విష‌యాల‌పై ఆరాలు తీస్తున్నారు. సుశాంత్ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసును విచారించడానికి ముంబయి వెళ్లిన బిహార్​ ఐపీఎస్​ ఆఫీసర్​ వియన్​ తివారీని నిర్బంధించారు. ఈ సంఘటనపై బిహార్ సీఎం నితీశ్​ కుమార్​ కూడా స్పందించారు. ఆఫీసర్​ వినయ్​ను నిర్బంధించడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. దీంట్లో రాజకీయం ఏమీ లేదని, బిహార్​ పోలీసులు తమ విధులు నిర్వర్తిస్తున్నారని సీఎం తెలిపారు. వినయ్​ క్వారంటైన్​ అంశాన్ని తమ డీజీపీ ముంబయి అధికారులతో మాట్లాడతారని వెల్లడించారు బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.