సంక్రాంతి కంటే ముందే సినిమాల సందడి మొదలైంది. డిసెంబరు ప్రారంభంలో వచ్చిన 'అఖండ'.. టాలీవుడ్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చింది. సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న భారీ సినిమా ఇది కావడం వల్ల జనాలు వస్తారా లేదా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ బాక్సీఫీస్ దుమ్ములేపుతోంది.
అల్లుఅర్జున్ 'పుష్ప'.. 'అఖండ'తో వచ్చిన జోష్‌ను ఇప్పుడు కొనసాగించాలని చూస్తోంది. అందులో భాగంగానే ట్రైలర్, పాటలు.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. అయితే పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా నిడివి 2 గంటల 56 నిమిషాలు ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 17న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.
ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమా నిడివి 3 గంటల 7 నిమిషాలు. రామ్‌చరణ్-ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఇది. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలుకొడుతుందో?
డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' సెన్సార్ కూడా పూర్తయిందని సమాచారం. దీనిబట్టి తెలుగులో 2 గంటల 20 నిమిషాల నిడివితో సినిమా రిలీజ్ కానుండగా.. హిందీలో మాత్రం 2 గంటలకు 30 నిమిషాల డ్యూరేషన్‌తో చిత్రాన్ని అభిమానులకు అందించనున్నారట. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. జనవరి 14న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రానుంది.
ఇవీ చదవండి:
- RRR trailer: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ రికార్డుల మోత
- నాటు నాటు స్టెప్.. రాజమౌళి వల్ల ఎన్టీఆర్‌కు కష్టాలు!
- ''పుష్ప'లో ఆ మూడు సీన్లు చూసి సుకుమార్-బన్నీకి దణ్ణం పెట్టేశా'
- Pushpa trailer: అల్లు అర్జున్ 'పుష్ప' ట్రైలర్ వచ్చేసింది..
- అక్కినేని నుంచి ప్రభాస్ వరకు.. ప్రేమ కోసం 'పునర్జన్మ'!
- Radheshyam story: ప్రభాస్ 'రాధేశ్యామ్' కథ లీక్!
- 'రాధేశ్యామ్'.. రికార్డు స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్!