ETV Bharat / sitara

RRR News: 'ఆర్ఆర్ఆర్' ప్రచారగీతం.. త్వరలో విదేశాలకు - ఆర్ఆర్ఆర్ రాజమౌళి

ప్రచారంలో భాగంగా ఓ గీతాన్ని తెరకెక్కించే పనిలో ఉంది 'ఆర్ఆర్ఆర్' టీమ్. అలానే మిగిలిన పాట చిత్రీకరణ కోసం త్వరలో విదేశాలకూ వెళ్లనుంది.

RRR promotional song shoot
ఆర్ఆర్ఆర్
author img

By

Published : Jul 18, 2021, 6:33 AM IST

అగ్రహీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌.. రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు తగ్గట్లుగా నిర్మాణాంతర పనులను వేగవంతం చేశారు. ఇప్పటికే రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఇప్పుడా మిగిలిన పాటల చిత్రీకరణ పూర్తి చేసేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఓ ప్రచార గీతాన్నీ రెడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. తాజాగా ఆ సెట్‌కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

RRR promotional song shoot underway
ఆర్ఆర్ఆర్ ప్రమోషనల్​ సాంగ్ సెట్

అలానే విదేశాల్లోనూ ఎన్టీఆర్‌, చరణ్‌లపై ఓ పాట చిత్రీకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. భారీ వ్యయంతో జార్జియాలోని అందమైన లొకేషన్లలో ఈ గీతం చిత్రీకరించనున్నారని సమాచారం. ఈనెలాఖరు నుంచి ఈ పాటల చిత్రీకరణ మొదలు కానుందని ప్రచారం జరుగుతోంది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.