తెలుగు చిత్రసీమపై కరోనా ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే దర్శకులు రాజమౌళి, తేజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు ఈ మహమ్మారిన పడగా.. ఇప్పుడు ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా కొవిడ్ 19 బారిన పడ్డారు. తాజాగా కరోనా పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణైంది. వైరస్ లక్షణాలు స్వల్పంగానే ఉండటం వల్ల ప్రస్తుతం ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
ఆయన కొంత కాలం క్రితమే గుండె సంబంధిత సమస్యలకు చికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలోనే 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రం తెరకెక్కుతోంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.