ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ తేదీ ఖరారు!.. చీఫ్​ గెస్ట్​ ఎవరంటే? - rrr MOVIE DATE

RRR prerelease event: దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ ప్రీ రిలీజ్​ ఈవెంట్​ను మార్చి 19న బెంగళూరులో నిర్వహించనున్నారని తెలిసింది. ఈ వేడుకకు కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై ముఖ్య అతిథిగా రానున్నట్లు తెలిసింది.

RRR TEAm
ఆర్​ఆర్​ఆర్​ ఫేమ్​
author img

By

Published : Mar 16, 2022, 4:14 PM IST

RRR prerelease event: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్అర్​ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్​లో బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా స్పెషల్​ ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను కూడా భారీగా ప్లాన్​ చేస్తోంది.

అయితే తాజాగా ఈ వేడుక నిర్వహణ తేదీని ఖరారు చేసినట్లు తెలిసింది. మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపుర్​లో గ్రాండ్​గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్​కు కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై, స్టార్​ హీరో శివరాజ్​కుమార్​లు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది.

రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిన ఈ చిత్రంలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చూడండి: నేను ఆ నటులతోనే వర్క్​ చేయాలనుకుంటాను: రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.