ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్​'కు కలిసొచ్చే అంశాలివే.. రూ.3వేల కోట్లు పక్కా! - movie collection records

RRR Movie: ఆర్​ఆర్​ఆర్​ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు. కచ్చితంగా రూ.మూడు వేల కోట్లకు పైగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా చరిత్ర తిరగరాయబోతుందని చెబుతున్నారు. మరి భారీ వసూళ్లను అందుకోవడానికి కలిసొచ్చే అంశాలేంటి? సినిమా ప్రత్యేకతలేంటి? లాంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం!

RRR Movie news
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 21, 2022, 11:17 AM IST

Updated : Mar 21, 2022, 11:50 AM IST

RRR Movie: దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల ఊహకు మించిన అనుభూతి కలుగుతుంది. కెరీర్​ ప్రారంభం నుంచి ఒక్కసారి కూడా ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో ఆయన విఫలం కాలేదు. ఇక 'బాహుబలి'తో హాలీవుడ్​ స్థాయి దర్శకుల జాబితాలో చేరిన ఆయన తన తదుపరి చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​ను కూడా.. భారీ స్థాయిలోనే తెరకెక్కించారు. దీంతో ఈ మూవీపై భారీగా అంచనాలను ఏర్పడ్డాయి. ఇందులో ఇద్దరు టాలీవుడ్​ స్టార్స్​ నటించడం, ఫిక్షనల్ అండ్ పీరియాడిక్​ సబ్జెక్ట్​ కావడం వల్ల రాజమౌళి అద్భుతం చేయడం ఖాయమని సినీప్రియులు భావిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా మూడు వేల కోట్లకు పైగా వసూలు చేస్తుందని ఈ సినిమాని చూసిన కలరిస్ట్​ శివకుమార్​ ట్వీట్​ చేశారు. ఈయనతో పాటే మరి కొంతమంది కూడా సినిమా చరిత్ర తిరగరాయబోతుందని తమ అభిప్రాయాలను తెలిపారు.

RRR Collections Records: రూ.450కోట్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ.1000కోట్ల ప్రీ రిలీజ్​ బిజినెస్​ కూడా చేసిందని ట్రేడ్​ వర్గాలు చెబుతున్నాయి. మరి బాక్సాఫీస్ ఓపెనింగ్స్​ ఎలా ఉండబోతున్నాయి? భారీ వసూళ్లను అందుకోవడానికి కలిసొచ్చే అంశాలేంటి? సినిమా ప్రత్యేకతలేంటి? వంటి విషయాలను ఓ సారి తెలుసుకుందాం..

  • మొదటగా ఈ సినిమాను ప్రపంచం గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించడం విశేషం. ఈ ఒక్క కారణంతోనే సినిమా చూసేందుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తి చూపుతారు.
  • ఇప్పటికే జక్కన్న తెరకెక్కించిన 'బాహుబలి'తో తెలుగు సినిమా మార్కెట్​ పరిధి కూడా పెరిగింది. ఆర్ఆర్ఆర్ సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించారు. ప్రముఖ హాలీవుడ్​ టెక్నీషియన్స్​ పనిచేశారు.
  • ఇప్పటికే విడుదలైన పోస్టర్స్​, సాంగ్స్​, ట్రైలర్​లో ఎన్టీఆర్​, రామ్​చరణ్​ తమ లుక్స్​, యాక్టింగ్​తో ఆకట్టుకోవడం.
  • బాలీవుడ్​ స్టార్స్​ అలియాభట్​, అజయ్​ దేవగణ్ ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ. బీటౌన్​లో వీరికి మంచి మార్కెట్​ ఉంది. ఇటీవలే ఆలియా.. 'గంగూబాయ్'​ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా చేరువైంది. హాలీవుడ్​ నటులు ఒలివియా మోరిస్‌, రే స్టీవ్‌సన్‌, అలిసన్‌ డూడీ ​ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరందరూ తెలుగు తెరకు ఈ చిత్రంతోనే పరిచయం కానున్నారు.
  • తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం.
  • ఐదో ఆటకు అనుమతి ఇవ్వడం సహా పదిరోజుల పాటు టికెట్‌ ధరలను పెంచుకునేలా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించడం. దీని వల్ల ఓపెనింగ్స్ మంచి కలెక్షన్లను అందుకుంటుందని అంచనా.
  • ఈ సినిమాలోని పాటలు శ్రోతలను బాగా అలరించాయి. 'జనని', 'నాటు నాటు' సహా తాజాగా విడుదలైన 'ఎత్తరజెండా' విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'ఎత్తర జెండా'లో దాదాపు అన్ని రాష్ట్రాల స్వాతంత్ర్య సమరయోధుల పేర్లు ప్రస్తావించి అందరి దృష్టిని ఆకర్షించింది చిత్ర బృందం​. కాబట్టి ఇది సినిమాకు మరింత బలం కానుంది.
  • ఈ మధ్య కాలంలో నార్త్​లో.. దక్షిణాది సినిమాల హవా విపరీతంగా పెరిగింది. మన సినిమాలను బాలీవుడ్​తో పాటు మిగతా భాషల వారు బాగా ఆదరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన 'పుష్ప' దీనికి నిదర్శనం.
  • మొత్తంగా ఈ సినిమాకు ఇన్ని ప్లస్సులు ఉండటం వల్ల.. సినిమా విజయం సాధించి భారతీయ బాక్సాఫీస్​ను షేక్​ చేస్తుందని అంతా భావిస్తున్నారు.

బాహుబలి2 రికార్డ్స్​ను కొట్టేస్తుందా?

ప్రభాస్ హీరోగా రానా దగ్గుపాటి విలన్​గా.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాహుబలి. బాక్సాఫీస్​ వద్ద అప్పటివరకు ఉన్న రికార్డ్స్​ను ఈ చిత్రం బ్రేక్ చేసింది. బాహుబలి-2 విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూళ్లు చేసింది. మొదటి రోజే రూ.213 కోట్లు(గ్రాస్) రాబట్టింది. 2017లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు.. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వీటిని బద్దలు కొట్టడం ఆర్ఆర్ఆర్​తోనే సాధ్యమవుతుందని సినీ ప్రియులు చెప్పుకుంటున్నారు. ఆన్​లైన్​లో విడుదలైన టికెట్లు.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్.. సరికొత్త బెంచ్​మార్క్ క్రియేట్ చేయడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చదవండి: 'పాన్‌ ఇండియా'.. రాజమౌళి వల్లే సాధ్యమైంది: ఆమిర్‌ ఖాన్‌

Last Updated : Mar 21, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.