ETV Bharat / sitara

అమృత్​సర్​లో 'ఆర్​ఆర్​ఆర్' టీమ్.. 'కేజీఎఫ్-2' నుంచి 'తుఫాన్' - RRR Team in golden temple

RRR Movie Pramotions: 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా ప్రమోషన్స్​లో భాగంగా చిత్ర బృందం.. అమృత్​సర్​లోని గోల్డెన్ టెంపుల్​ను సందర్శించింది. చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్.. పూజలు నిర్వహించారు. ​అటు, కేజీఎఫ్-2 నుంచి 'తుఫాన్' లిరికల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్ర బృందం.

RRR Movie Pramotions
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Mar 21, 2022, 12:51 PM IST

RRR Movie Pramotions: 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్​లో బిజీగా గడుపుతోంది. ఇందులో భాగంగా ఇటీవల దుబాయ్​లో చిత్రబృందం సందడి చేసింది. ఆ తర్వాత దేశంలో వివిధ ప్రదేశాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. గుజరాత్‌ కెవాడియాలోని సర్దార్​ వల్లభాయ్‌ పటేల్ ఐక్యతా విగ్రహాన్ని చిత్రయూనిట్‌ ఆదివారం సందర్శించింది. చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్​.. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద సందడి చేశారు. తాజాగా, సోమవారం అమృత్​సర్​లోని గోల్డెన్ టెంపుల్​లో పూజలు నిర్వహించారు.

rrr
గోల్డెన్ టెంపుల్​లో ఆర్​ఆర్​ఆర్ టీం

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం (రణం రౌద్రం రుధిరం) 'ఆర్​ఆర్​ఆర్'​. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్​చరణ్​ సరసన అలియా భట్​, ఎన్టీఆర్​ సరసన ఒలివియా మోరిస్​ నటిస్తున్నారు. అజ‌య్‌దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

rrr
స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ వద్ద ఆర్​ఆర్​ఆర్​ బృందం

కేజీఎఫ్​ 2 సాంగ్​..

KGF 2 Song Release: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీఎఫ్​ 2' నుంచి కొత్త అప్డేట్​ వచ్చింది. ఈ చిత్రం నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలకి సంబంధించిన లిరికల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్ర బృందం.

rrr
కేజీఎఫ్ 2 సాంగ్ రిలీజ్​

'తుపాన్' అంటూ సాగే ఈ పాట.. ప్రేక్షకులను అమితంగా ఆకర్షించేలా ఉంది. 'అతను మా జీవితాల్లోకి రాకముందు చూవు మా మీద గంతులేసేది.. అతను వచ్చిన తర్వాత చావు మీద మేము గంతులేస్తున్నాం'..అంటూ హీరో ఎంట్రీతో సాంగ్ మొదలవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కన్నడ స్టార్​ హీరో యశ్​ ప్రధాన పాత్రలో నటించిన 'కేజీఎఫ్' తొలి భాగం 2018లో దేశవ్యాప్తంగా విడుదలై, అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. కేజీఎఫ్​ పార్ట్​ 2 ఏప్రిల్​ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తొలి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు 'కేజీఎఫ్ 2'లో సమాధానం లభించనుంది.

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్​'కు కలిసొచ్చే అంశాలివే.. రూ.3వేల కోట్లు పక్కా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.