ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. బాహుబలి సిరీస్ తర్వాత జక్కన్న నుంచి వస్తోన్న సినిమా కావడం వల్ల దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాకుండా ఎన్టీఆర్, రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా నటించడం వల్ల ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రయోగం చేస్తున్నాడట ఎన్టీఆర్.
ఈ సినిమా తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ వెర్షన్లలో ఏకకాలంలో విడుదల కానుంది. అయితే ఇంత ప్రతిష్ఠాత్మక చిత్రానికి తారక్ అన్ని భాషల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొనేందుకు సిద్ధమవుతున్నాడట. ఇప్పటికే ఈ భాషలు నేర్చుకునే పనిలో యంగ్ టైగర్ ఉన్నట్లు సమాచారం. మరి చరణ్ కూడా ఇదే తరహా ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.
దాదాపు రూ.350 కోట్లతో సినిమా రూపొందుతోంది. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్, ఆలియా భట్, తమిళం నుంచి సముద్రఖని తదితరులు ఇందులో నటిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ సమకూర్చగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమా వచ్చే ఏడాది జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి...సంగీత దర్శకుడికి సాయిధరమ్ తేజ్ సాయం..!