ETV Bharat / sitara

మరికొద్ది గంటల్లో 'ఆర్​ఆర్​ఆర్'​ సర్​ప్రైజ్​ - ఆర్​ఆర్​ఆర్​ వార్తలు

రామ్​చరణ్​, జూనియర్ ఎన్టీఆర్​ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆర్​ఆర్​ఆ'ర్​ చిత్రం నుంచి శుభవార్త వచ్చింది. మార్చి 25న సినిమా లోగో, మోషన్​ పోస్టర్​ను విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

rrr movie department anounced a date of motion poster and title logo
'ఆర్​ఆర్​ఆర్'​ సర్​ప్రైజ్​.. మరికొద్ది గంటల్లో మోషన్​ పోస్టర్​
author img

By

Published : Mar 24, 2020, 7:43 PM IST

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి శుభవార్త వచ్చింది. సామాజిక మాధ్యమాల వేదికగా రేపు (మార్చి 25) ఈ సిినిమా టైటిల్​ లోగో, మోషన్​ పోస్టర్​ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ మేరకు రాజమౌళి ట్విట్టర్​ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.

rrr movie department anounced a date of motion poster and title logo
'ఆర్​ఆర్​ఆర్'​ సర్​ప్రైజ్​.. మరికొద్ది గంటల్లో మోషన్​ పోస్టర్​

ప్రస్తుతం కరోనా వైరస్​ దృష్ట్యా చిత్రబృందం అంతా ఇంటి నుంచే పనిచేస్తున్నాం. అభిమానులు, ప్రేక్షకుల్ని నేను కోరేది ఒక్కటే. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆన్‌లైన్లో మాత్రమే పోస్టర్‌ను ఎంజాయ్‌ చేయండి. ప్రింట్లు, ఫ్లెక్స్‌లు పెట్టొద్దు.

రాజమౌళి, దర్శకుడు

రామ్​చరణ్​, జానియర్ ఎన్టీఆర్​ కథానాయకులుగా భారీ బడ్జెట్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆలియా భట్​, ఒలివియా మోరిస్​ కథానాయికలు. డీవీవీ ఎంటర్​టైన్మెంట్స్​ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.