ETV Bharat / sitara

'పాన్‌ ఇండియా'.. రాజమౌళి వల్లే సాధ్యమైంది: ఆమిర్‌ ఖాన్‌

RRR Movie: 'బాహుబలి'తో భారతీయ సినిమా స్థాయిని పెంచారంటూ దర్శకుడు రాజమౌళిని కొనియాడారు ప్రముఖ బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ఖాన్‌. ఆయన వల్లే ప్రస్తుతం పాన్​ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కుతున్నాయని అన్నారు.

author img

By

Published : Mar 21, 2022, 6:29 AM IST

RRR Movie
ఆమిర్‌ ఖాన్‌

RRR Movie: దర్శకుడు రాజమౌళి వల్లే సినిమాలు ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయని బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమిర్‌ఖాన్‌ అన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 'బాహుబలి'తో భారతీయ సినిమా స్థాయిని పెంచారంటూ రాజమౌళిని కొనియాడారు. నటులు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, అలియా ఏదైనా త్వరగా నేర్చుకోగలరని, తనకు జ్ఞాపకశక్తి తక్కువని చెప్పారు. ట్రైలర్‌, పాటలు తననెంతగానో ఆకట్టుకున్నాయని, అందరిలానే తానూ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా కోసం ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌తో కలిసి ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు స్టెప్పులేశారు.

RRR
ఆర్​ఆర్​ఆర్​ బృందం

రాజమౌళి మాట్లాడుతూ.. ఆమిర్‌ ఖాన్‌ నటించిన 'లగాన్‌' చిత్రం దక్షిణాది, ఉత్తరాది అని తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుందని, ఆ స్ఫూర్తితోనే పాన్‌ ఇండియా స్థాయిలో చిత్రాలను తెరకెక్కించానని తెలిపారు. ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషన్‌ ఉంటే ఏ సినిమా అయినా సరిహద్దులు చెరిపేయగలదని అన్నారు.

ఇదీ చదవండి: ఐక్యతా విగ్రహం వద్ద 'ఆర్​ఆర్​ఆర్​ టీమ్'​ సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.