బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేశ్ దేశ్ముఖ్.. ఆసక్తికర విషయం చెప్పాడు. 20 ఏళ్ల పాటు కెమెరా ముందున్న తాను.. ఇప్పుడు కెమెరా వెనకుండి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు వెల్లడించాడు. అందుకు సంబంధించిన వివరాలను, పోస్టర్ను బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
-
After being in front of the camera for 20 years, I take a big leap to stand behind it for the first time.
— Riteish Deshmukh (@Riteishd) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
As I direct my first marathi film, i humbly ask you all for your good wishes and blessings. Be a part of this journey, be a part of this madness.
वेड (Madness). pic.twitter.com/ydjr6cdXqG
">After being in front of the camera for 20 years, I take a big leap to stand behind it for the first time.
— Riteish Deshmukh (@Riteishd) December 8, 2021
As I direct my first marathi film, i humbly ask you all for your good wishes and blessings. Be a part of this journey, be a part of this madness.
वेड (Madness). pic.twitter.com/ydjr6cdXqGAfter being in front of the camera for 20 years, I take a big leap to stand behind it for the first time.
— Riteish Deshmukh (@Riteishd) December 8, 2021
As I direct my first marathi film, i humbly ask you all for your good wishes and blessings. Be a part of this journey, be a part of this madness.
वेड (Madness). pic.twitter.com/ydjr6cdXqG
2003లో వచ్చిన రొమాంటిక్ మూవీ 'తుఝే మేరీ కసమ్'తో నటుడిగా పరిచయమయ్యారు రితేశ్. ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్ని అలరించారు.
తన తొలి సినిమాలో హీరోయిన్గా నటించిన జెనీలియాను 2012లో పెళ్లి చేసుకున్నారు రితేశ్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇప్పుడు 'వేడ్' సినిమాతో దర్శకుడిగా మారారు రితేశ్. మరాఠీలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తనతో పాటు భార్య జెనీలియా కూడా నటిస్తోంది. ఈమెకు ఇదే తొలి మరాఠీ చిత్రం కావడం విశేషం. రొమాంటిక్ కథతో తీస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 12న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: