దేశంలోనే అత్యంత ధనిక సినీ పరిశ్రమగా బాలీవుడ్ గుర్తింపు పొందుతోంది. ఇక్కడి సినిమాలకు భారీ బడ్జెట్లే కాదు హీరోహీరోయిన్లకు పారితోషికాలు ఎక్కువగానే ఉంటాయి. కొందరు స్టార్ నటులు అయితే కోట్లలో ఆర్జిస్తున్నారు. ఫోర్బ్స్ జాబితా ప్రకారం బీటౌన్‌లో టాప్-10 సెలబ్రిటీస్ ఎవరో చూద్దాం.
సల్మాన్ ఖాన్
బాలీవుడ్లో అందరికంటే ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తోంది కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఇతడు దాదాపు రూ.250 కోట్లు సంపాదిస్తున్నాడు. భాయ్‌జాన్ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి గిరాకీ ఉండటం ఇతడి భారీ సంపాదనకు అసలైన కారణం. సినిమాలతో పాటు ప్రకటనల్లోనూ జోరు చూపిస్తాడు సల్మాన్. అలాగే పలు బిజినెస్‌లతో పాటు ఇతడికి ఛారిటీలూ ఉన్నాయి.
అక్షయ్ కుమార్
ఏడాదిలో డజన్‌కుపైగా సినిమాలు చేయగలా సత్తా ఉన్న నటుడు అక్షయ్ కుమార్. మంచి కథ దొరికితే చాలు దాన్ని తక్కువ సమయంలోనే పట్టాలెక్కించేస్తాడు. సంపాదన పరంగానూ ఇతడు టాప్‌లో ఉన్నాడు. ఏడాదికి దాదాపు రూ.186 కోట్లు ఆర్జిస్తున్నాడు. సినిమాలతో పాటు ప్రకటనల ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్నాడు. అలాగే పలు ఛారిటీలూ ఉన్నాయి.
దీపికా పదుకొణె
బాలీవుడ్లో హీరోలకే కాక హీరోయిన్లకు మంచి మార్కెట్ ఉంది. అందుకు దీపికా పదుకొణెనే నిదర్శనం. ఈ నటి ఏడాదికి రూ.113 కోట్లు సంపాదిస్తోంది. బీ టౌన్ హీరోయిన్లలో అందరికంటే ఎక్కువ ఆర్జిస్తోన్న నటిగా గుర్తింపు సాధించింది. దీపిక భర్త రణ్వీర్ కూడా రూ.84 కోట్ల వరకు ఆర్జిస్తున్నాడు. వీరిద్దరూ బిజినెస్ పరంగానూ దూసుకెళ్తున్నారు.
ఆమిర్ ఖాన్
ప్రేక్షకులకు మంచి చిత్రాలను అందించడంలో ఎప్పుడూ ముందుంటాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సంపాదన పరంగానూ ముందే ఉన్నాడు. ఇతడు ఏడాది రూ.97 కోట్లు ఆర్జిస్తున్నాడు. సినిమాలే ఇతడి ప్రధాన ఆదాయం. వేరే బిజినెస్‌ల వైపు ఇతడు ఎక్కువగా వెళ్లడు.
అమితాబ్ బచ్చన్
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఎంతో కాలంగా సినీ పరిశ్రమకు సేవలందిస్తున్నారు. ఎందరో హీరోలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు. సంపాదన పరంగానూ బిగ్‌బీ ముందున్నారు. ఈయన ఏడాదికి దాదాపు రూ.90 కోట్ల వరకు ఆర్జిస్తున్నారు.
రణ్వీర్ సింగ్
యువ నటుడు రణ్వీర్ సింగ్ ఏడాదికి దాదాపు రూ.84 కోట్లు ఆర్జిస్తున్నాడు. పక్కా కమర్షియల్ చిత్రాలతో అలరించే హీరో కొన్ని బిజినెస్‌ల్లోనూ రాణిస్తున్నాడు.
అజయ్ దేవ్‌గణ్
నటుడిగానే కాక నిర్మాతగానూ ఆకట్టుకుంటున్నాడు అజయ్ దేవ్‌గణ్. ఇతడు ఏడాదికి దాదాపు రూ.69 కోట్లు ఆర్జిస్తున్నాడు. మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు.