శిల్పాశెట్టి.. ఈ పేరు ప్రస్తుతం వార్తల్లో హాట్‌టాపిక్! ఈమె భర్త రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల దందా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లడమే ఇందుకు కారణం. ఈ వ్యాపారంలో ఆమె హస్తం కూడా ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో తనకేమీ సంబంధంలేదని శిల్పా వివరణ కూడా ఇచ్చింది. అయితే ఒకప్పుడు తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ భామ.. ఇలా వివాదాల్లో నిలవడం కొత్తేమి కాదు. ఇంతకీ అవేంటంటే?
అక్షయ్‌కుమార్‌తో బ్రేకప్
శిల్పాశెట్టి.. అక్షయ్‌కుమార్‌తో 1992లో 'ఖిలాడీ' సినిమాలో నటించింది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమించుకున్నారని తెగ వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రేమ ఎక్కువ కాలం సాగలేదు! గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఈ విషయాన్ని బయటపెట్టింది. అక్షయ్ తనను మోసం చేశాడని ఆరోపించింది.
రిచార్డ్ గెరెతో ముద్దు
2007లో ఎయిడ్స్‌పై ప్రచారంలో భాగంగా భారత్ వచ్చిన హాలీవుడ్ నటుడు రిచర్డ్ గెరె.. శిల్పాశెట్టిని ముద్దుపెట్టుకున్నాడు. బహిరంగంగా అలా ముద్దాడడంపై అప్పట్లో తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. పలు ప్రజా సంఘాలు, పార్టీలు శిల్పాకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లాయి. వారిద్దరిని అరెస్ట్ చేయాలని రాజస్థాన్ కోర్టు వారంట్ కూడా జారీ చేసింది. కానీ ఆ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని కొట్టిపారేసింది. ఆ విషయంపై ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
జాతివివక్ష వ్యాఖ్య
2002 ఇంగ్లాండ్‌లో 'సెలబ్రిటీ బిగ్ బ్రదర్' రియాలిటీ షోలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది శిల్పా. ఆ షోలో గెలుపొంది భారీ మొత్తంలో నగదు బహుమతిని అందుకుంది. అయితే ఈ కార్యక్రమంలో శిల్పాపై తన హౌస్మేట్స్ జేడ్ గుడీ, డేనియల్ లాయిడ్ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. ఏదేమైనప్పటికీ ఆ ఎపిసోడ్లో ప్రపంచం మొత్తం ఆమెకు అండగా నిలిచింది. ఈ షోలో 63 శాతం ఓట్లతో విజయం సాధించి, విశేష ప్రాచుర్యాన్ని సంపాదించింది.
తప్పేముంది?
2006లో శిల్పాశెట్టి, రీమాసేన్లకు మధురై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఓ తమిళ దినపత్రిక కోసం వారు అసభ్యకరంగా పోజులిచ్చారు. దీనిపై కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత దీని గురించి శిల్పా మాట్లాడుతూ.. "ఇందులో అశ్లీలత ఏముంది? ఒకవేళ నాభి చూపించడంలో అశ్లీలత ఉందంటే, దేశ సంప్రదాయమైన చీరను మొదటగా బ్యాన్ చేయాలి" అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు అపట్లో దూమారం చెలరేగాయి.
శిల్పాశెట్టి.. తొలి తెలుగు చిత్రం 'సాహసవీరుడు సాగరకన్య'తో ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత బీటౌన్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో నిర్మాతగా, టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బిజీ బిజీగా ఉంది. తల్లి అయినప్పటికీ ఆమె అందంలో ఏ మాత్రం మార్పులేదు. నవతరం కథానాయికలకు సైతం పోటీనిచ్చేలా ఆమె తన అందాన్ని ఇంకా కాపాడుకోవడం విశేషం.
ఇదీ చూడండి: RajKundra news: కుంద్రా కేసులో 'శిల్పాశెట్టి' పాత్ర ఉందా?