"కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్" అని చెప్పిన ఓ ఆరడుగుల అందగాడు.. డార్లింగ్‌గా ఎందరో హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. భళిరా భళీ అంటూ 'బాహుబలి' సిరీస్‌తో బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డుల్ని లిఖించాడు. దక్షిణాది చిత్రరంగం గ్రాఫ్ పెంచడంలో తనదైన పాత్ర పోషించాడు. ప్రస్తుతం బహుభాషా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. తన నటనతో విదేశాల్లోనూ గుర్తింపు తెచుకున్నాడు. అతడే ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు(prabhas birthday).
డార్లింగ్ పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్. టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ రెబల్‌స్టార్. ముచ్చటగా మూడక్షరాలతో ప్రభాస్ అని పిలిస్తే పలికే ఆయన... నేడు 42వ వసంతంలోకి అడుగుపెట్టాడు(prabhas birthday). ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు.
1979 అక్టోబరు 23న సూర్య నారాయణరాజు, శివకుమారి దంపతులకు జన్మించాడు ప్రభాస్(prabhas birthday). సొంతూరు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. ప్రముఖ కథానాయకుడు కృష్ణంరాజు ప్రభాస్‌కు పెదనాన్న. ఇంట్లో సినిమా వాతావరణం ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదట ప్రభాస్. స్వతహాగా సిగ్గరి అయిన ఆయన.. వెండితెరపై అడుగుపెట్టి 19 సినిమాల్లో నటించాడు.
తొలిపరిచయం
2002లో జయంత్ సీ పరాంజీ దర్శకత్వంలో వచ్చిన 'ఈశ్వర్' సినిమాతో తెరంగేట్రం చేశాడు ప్రభాస్(prabhas eeshwar movie). జోడీగా అందాల తార మంజుల కూతురు శ్రీదేవి నటించింది. 2003లో 'రాఘవేంద్ర', 2004లో 'వర్షం'(prabhas varsham movie), 'అడవిరాముడు' చిత్రాల్లో ప్రేమికుడిగా మంచిముద్ర వేశాడు. 2005లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చక్రం' సినిమా ప్రభాస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
స్టార్ ఇమేజ్
2005లో వచ్చిన 'ఛత్రపతి'(prabhas chatrapathi movie) ప్రభాస్‌కు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 2006లో ప్రభుదేవా దర్శకత్వంలో 'పౌర్ణమి' చిత్రంలో వైవిద్యభరితమైన పాత్ర పోషించాడు. ఇది ఆశించిన స్థాయిలో రాణించక పోయినా ప్రభాస్‌కు మాత్రం హీరోగా ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 2007లో 'యోగి', 'మున్నా', 2008లో 'బుజ్జిగాడు', 2009లో 'బిల్లా', 'ఏక్ నిరంజన్' చిత్రాలు ప్రభాస్ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లాయి. 'బిల్లా' చిత్రంలో తన పెదనాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజుతో వెండితెర పంచుకున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'బాహుబలి'తో రికార్డులు
2010లో 'డార్లింగ్' సినిమా ప్రభాస్‌పై రొమాంటిక్ హీరో ముద్ర వేసింది. తర్వాత 2011లో వచ్చిన 'మిస్టర్ ఫర్ఫెక్ట్',2012లో 'రెబల్', 2013లో 'మిర్చి' సినిమాలు ప్రభాస్ కెరీర్ గ్రాఫ్‌ను మరింత పెంచేశాయి. 2015, 2017లో విడుదలైన 'బాహుబలి'(bahubali prabhas) సిరీస్‌లోని రెండు భాగాలు.. ప్రభాస్ కెరీర్‌ను ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకువెళ్లాయి.
'మేడమ్ టుస్సాడ్స్'లో ప్రభాస్ శిల్పం
దక్షిణాది తారలెవరికీ దక్కని తొలి అవకాశం ప్రభాస్‌కు దక్కింది. మేడం టుస్సాడ్స్(madame tussauds bahubali statue)లో ఆయన మైనపు శిల్పం కొలువు తీరింది. నంది అవార్డులు, ఫిలిం ఫేర్ అవార్డులు అందుకున్న ప్రభాస్... 'సాహో' చిత్రం ద్వారా చివరగా ప్రేక్షకులను పలకరించాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పెళ్లి గురించీ చర్చే..
టాలీవుడ్ ఆన్ స్క్రీన్ పాపులర్ జోడీ ప్రభాస్, అనుష్క ప్రేమలో ఉన్నారని ఎంతో ప్రచారం జరిగింది. వీరిద్దరి పెళ్లి(prabhas anushka marriage) జరగబోతోందని వార్తలు వచ్చాయి. ఈ వదంతులపై ప్రభాస్‌ను స్పందిస్తూ.. అనుష్క తనకు మంచి స్నేహితురాలని సమాధానం ఇచ్చాడు. అప్పట్నుంచి ఈ బ్యాచిలర్ హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడా అని అందరూ చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
త్వరలో 'రాధేశ్యామ్'గా
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్'(prabhas radheshyam new look). పూజా హెగ్డే కథానాయిక. గోపీకృష్ణ మూవీస్ సంస్థ నిర్మించింది. ఎప్పుడో షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. జనవరి 7న సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 'సాహో' తర్వాత చాలా గ్యాప్ రావడం వల్ల ఈ చిత్రం కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
భారీ సినిమాలు క్యూలో..
'రాధేశ్యామ్' ఇంకా రిలీజ్ కాకముందే వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పేశాడు ప్రభాస్. ఇవన్నీ భారీ ప్రాజెక్టులే కావడం విశేషం. ఇందులో ప్రశాంత్ నీల్‌తో 'సలార్' (యాక్షన్ ఎంటర్టైనర్), ఓంరౌత్‌తో 'ఆదిపురుష్' (ఇతిహాస కథ), నాగ్ అశ్విన్‌తో 'ప్రాజెక్ట్-కే' (సైన్స్ ఫిక్షన్)తో పాటు తన 25వ సినిమాగా సందీప్‌రెడ్డి వంగాతో 'స్పిరిట్'(prabhas spirit movie poster) అనే చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా ఏకంగా 8 భాషల్లో రూపొందుతుండటం గమనార్హం. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.