Raveena Tandon KGF movie: యశ్ నటించిన 'కేజీయఫ్-2' విడుదల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ నటి రవీనాటాండన్. మోస్ట్ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రవీనా కీలక పాత్రలో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
"ఈ సినిమాలో నేను ఇందిరాగాంధీ పాత్ర పోషించానని వార్తలు వస్తున్నాయి. వాటిల్లో ఎలాంటి నిజం లేదు. ఈ సినిమా కథకూ ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. నేను పోషించిన పాత్ర ఆమెను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించింది కాదు. ఇప్పటికే నేను పలు దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించాను. 'పాండవులు పాండవులు తుమ్మెద' తర్వాత చాలా కాలం విరామం అనంతరం మరోసారి ఈ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరిస్తా. ప్రశాంత్‌నీల్, యశ్‌లతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే ఈ సినిమాలో నా ఆల్‌టైమ్ ఫేవరెట్ కో స్టార్ సంజయ్ దత్ సైతం కీలకపాత్ర పోషించారు. ఈసినిమా ఓకే చేశాక.. మేమిద్దరం మరోసారి స్క్రీన్‌పై మెరుపులు పూయించాలనుకున్నాం. కాకపోతే, షూట్ ప్రారంభమయ్యాక తెలిసింది.. మా ఇద్దరికీ ఒక్క సీన్ కూడా కలిసి ఉండదని. కథ అనుకూలించకపోవడం వల్ల మేమిద్దరం కలిసి స్క్రీన్ పంచుకోలేకపోయాం" అని రవీనా వివరించారు.
ఇదీ చూడండి:
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!