ETV Bharat / sitara

మహేశ్ ఫ్యామిలీకి రష్మిక సర్​ప్రైజ్ గిఫ్ట్ - మహేశ్ బాబు వార్తలు

లాక్​డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు సినీతారలు. ఈ ఖాళీ సమయంలో కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ లాక్​డౌన్ సమయంలో హీరోయిన్ రష్మిక, మహేశ్ బాబు కుటుంబానికి ఓ సర్​ప్రైజ్ గిఫ్ట్ పంపారు.

Rashmika surprise to Mahesh Family
రష్మిక
author img

By

Published : Jun 30, 2020, 1:27 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు లేకపోవడం వల్ల ప్రస్తుతం సినీ తారలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయాన్ని కుటుంబసభ్యులతో సరదాగా గడిపేస్తున్నారు. ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు'తో ఆకట్టుకున్నారు మహేశ్‌బాబు-రష్మిక జోడి. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ఇళ్లలో వారు ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూర్గ్‌ నుంచి మహేశ్‌ కుటుంబానికి రష్మిక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ పంపారు. అదేంటో తెలుసా? మామిడికాయ పచ్చడికి సరిపడా సరంజామా బాక్స్‌.

రష్మిక పంపిన ఈ గిఫ్ట్‌ను మహేశ్ సతీమణి నమ్రత అభిమానులతో పంచుకున్నారు. "కూర్గ్‌ నుంచి ఇవన్నీ మాకు పంపినందుకు థ్యాంక్యూ రష్మిక. కొవిడ్‌ సమయంలో మాకు అందిన మొదటి గిఫ్ట్‌" అని రిప్లై ఇచ్చారు. దీనికి రష్మిక స్పందిస్తూ "మీకు అవి నచ్చుతాయని ఆశిస్తున్నా" అని అన్నారు.

సంక్రాంతి కానుకగా వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు మహేశ్‌, రష్మిక. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం మహేశ్‌ సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్‌ 'పుష్ప'లో కథానాయికగా నటిస్తున్నారు రష్మిక. లాక్‌డౌన్‌ కారణంగా ఈ మూవీ చిత్రీకరణ వాయిదా పడగా, మహేశ్‌ 'సర్కారు వారి పాట' పట్టాలెక్కాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.