ETV Bharat / sitara

సొంత నిర్మాణ సంస్థ స్థాపించిన హీరో రణ్​వీర్ - Ranveer Singh own production house

ప్రముఖ కథానాయకుడు రణ్​వీర్ సింగ్.. సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా టీనేజర్స్​ కోసం ప్రత్యేకంగా సినిమాలు తీస్తానని అంటున్నారు.

Ranveer Singh sets up his own production house
హీరో రణ్​వీర్ సింగ్
author img

By

Published : Aug 4, 2020, 12:33 PM IST

ఎన్నో బాలీవుడ్ చిత్రాల్లో కథానాయకుడిగా నటించి, మెప్పించిన హీరో రణ్​వీర్ సింగ్.. ఇప్పుడు సొంత నిర్మాణ సంస్థ మా కసమ్‌ ఫిల్మ్స్​ను స్థాపించారు. గతంలో దీని గురించి మాట్లాడిన రణ్​వీర్.. టీనేజర్స్ కోసం ప్రత్యేకంగా సినిమాలు తీయాలని భావిస్తున్నట్లు తెలిపారు. తనకు వ్యాపార చతురత లేదని, సృజనాత్మకత నిర్మాతను అసలే కానని చెప్పారు.

ఈ నిర్మాణ సంస్థ గురించి మాట్లాడిన కొందరు సినీ ప్రముఖులు.. రణ్​వీర్ సింగ్ వినోధభరిత, భారీ చిత్రాలను నిర్మించగలరని అభిప్రాయపడ్డారు. చిత్రసీమకు ఇలాంటి సంస్థలు అవసరం ఎంతో ఉందని చెప్పారు.

రణ్​వీర్ ఇప్పటికే మ్యూజిక్​కు సంబంధించి ఇప్పటికే 'ఇంక్‌ఇంక్‌' సంస్థను స్థాపించారు. తన భార్య దీపికా పదుకొణెతో కలిసి 'చాక్‌ అండ్‌ చీజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌' సంస్థను గతేడాది ప్రారంభించారు. దీపిక కూడా సొంతంగా 'కె.ఎ ప్రొడక్షన్‌'ను 'ఛపాక్‌' సినిమాను నిర్మించింది. వీళ్లే కాకుండా చాలామంది నటీనటులు సొంత సంస్థల్లో చిత్రాలు చేస్తూ, ప్రేక్షకుల అలరిస్తున్నారు. వీరిలో అనుష్క శర్మ, కంగనా రనౌత్‌ తదితరులు ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.