ETV Bharat / sitara

'నేనింతే.. నా వ్యక్తిత్వంపై విమర్శల్ని పట్టించుకోను'

బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్​ది అందరికంటే కాస్త విభిన్నమైన వైఖరి. బహిరంగ వేదికలపై ఎంతో ఎనర్జిటిక్​గా కనిపించే ఈ హీరో.. తాజాగా తన లైఫ్​స్టైల్ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

author img

By

Published : Jul 19, 2019, 5:31 AM IST

రణ్​వీర్

"నా చేష్టలు.. విచిత్రమైన వైఖరి.. విభిన్నమైన అలవాట్లు నిన్న మొన్న పుట్టినవి కావు’' అంటున్నాడు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌. ఈ యువ హీరో పేరు చెప్పగానే యువతరంలో ఓ తెలియని పూనకం మొదలైపోతుంది. వైవిధ్యమైన వస్త్రధారణ, చలాకీతనానికి చిరునామాగా నిలిచే అతడి మాటలు అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటాయి. అంతేకాదు ఈ లక్షణాలే రణ్​వీర్​ను కుర్రకారుకు మరింత దగ్గర చేశాయి.

ranveer singh about his personal life
రణ్​వీర్ సింగ్

బహిరంగ వేదికలపై ఎంతో ఎనర్జిటిక్‌గా కనిపించే రణ్‌వీర్‌ నిజ జీవితంలో ఎలా ఉంటాడు?. ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తి అతడి అభిమానులతో పాటు సినీప్రియుల్లోనూ కనిపిస్తుంటుంది. తాజాగా దీనిపై ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు రణ్‌వీర్‌.

ranveer singh about his personal life
రణ్​వీర్ సింగ్

"ప్రజల ముందు నేనెప్పుడూ నా నిజస్వభావాన్నే ప్రదర్శిస్తుంటా. నాది ఓ విభిన్నమైన మనస్తత్వం అని చిన్నప్పటి నుంచే తెలుసు. దాన్ని నేనెప్పుడూ దాచి పెట్టే ప్రయత్నం చేయలేదు. చాలా మంది నేను అందరిలా ప్రవర్తించనని అంటుంటారు. కానీ, నా వ్యవహార శైలి చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. దాన్ని మార్చుకోవడం ఇష్టం ఉండదు. వేరే వారిలాగా మారడాన్ని ఎప్పుడూ ఇష్టపడను. నన్ను నాలా.. చూసేవాళ్లు కేవలం నా బాల్య మిత్రులు, కుటుంబ సభ్యులు మాత్రమే".

-రణ్​వీర్ సింగ్, బాలీవుడ్ హీరో

'నా ఈ విచిత్రమైన చేష్టలు.. వైవిధ్యమైన వైఖరి నిన్నమొన్న పుట్టుకొచ్చినవి కావు.. నా వస్త్రధారణా మొదటి నుంచి ఇలా విభిన్నంగానే ఉంది' అని చెబుతున్నాడు రణ్​వీర్. మూడో తరగతిలోనే మోహాక్‌ హెయిర్‌ స్టైల్‌ ట్రై చేసిన ఈ హీరో ఆ ఫొటోను ఇటీవల సోషల్‌ మీడియాలోనూ షేర్‌ చేశాడు. అలాంటి చిత్రాలు నా దగ్గర బోలెడున్నాయని అంటున్నాడీ హీరో. 'ఇదంతా ప్రచారం కోసం, అందరి దృష్టినీ ఆకర్షించాలని చేస్తున్న పనులైతే కావని.. తన వ్యక్తిత్వంపై వచ్చే విమర్శలను ఎప్పుడూ పట్టించుకోనని' తెలిపాడు.

ఇవీ చూడండి.. ఒక్క పాట కోసం ముగ్గురు కామ్రేడ్స్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Tsurigasaki Beach, Kujukuri / Ichinomiya, Chiba Prefecture, Japan.18th July, 2019
+++ TO FOLLOW +++
SOURCE: SNTV
DURATION:
FULL STORYLINE TO FOLLOW:
Surfing will make its Olympic debut next year at the Tokyo summer games and on Thursdsay the venue - Tsurigasaki Beach - held its first test event.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.