బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన పెద్దనాన్న రణ్‌దీర్ కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం రణ్‌బీర్ బాగానే ఉన్నట్లు తెలిపారు.
"నేను అతడికి బాగానే ఉందని అనుకుంటున్నా. ప్రస్తుతం నేను పట్టణంలో లేను. తీవ్రత ఎంత ఉందో ఇంకా తెలియదు" అని పేర్కొన్నారు రణ్‌దీర్.
గతేడాది బాలీవుడ్‌కు చెందిన పలువురు కరోనా బారినపడ్డారు. అమితాబ్ బచ్చన్, అభిషేన్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నీతూ కపూర్, అర్జున్ కపూర్, కృతి సనన్, మలైకా అరోరా ఇంకా చాలామంది వైరస్ బారినపడి కోలుకున్నారు.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు రణ్‌బీర్. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'షంషేరా'తో పాటు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న 'బ్రహ్మాస్త్ర' షూటింగ్‌ల్లో పాల్గొంటున్నారు. ఇందులో ఇతడి ప్రేయసి ఆలియా భట్ హీరోయిన్గా చేస్తోంది.