బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్(ranbir alia bhatt marriage).. ఈ ఏడాదిని శుభవార్తతో వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. వీరు డిసెంబరులో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు ప్రస్తుతం బాలీవుడ్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వీరి వివాహ వేడుకకు రాజస్థాన్‌లోని ఓ ఐకానిక్ పాల్యెస్ వేదిక కానున్నట్లు తెలిసింది(ranbir alia marriage). పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా జరగుతున్నాయట!
![Ranbir and Alia](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13460686_ranbir.jpg)
ప్రస్తుతం రణ్‌బీర్-ఆలియా(ranbir kapoor alia bhatt) కలిసి 'బ్రహ్మస్త్ర' సినిమాలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌ను త్వరగా ముగించి మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నారట. మిగతా ప్రాజెక్ట్‌ల షూటింగ్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేశారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశముంది.
త్వరలోనే ఆలియా(Aliabhatt RRR movie).. 'ఆర్ఆర్ఆర్', 'గంగూబాయ్ కతియావాడి' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటే డార్లింగ్స్, రాకీ ఔర్ రానీ కీ ప్రేమ్ కహానిలో నటిస్తోంది. కాగా, రణ్‌బీర్.. 'షంషేరా' సహా మరో చిత్రంలో నటిస్తున్నాడు.
ఇదీ చూడండి: రణ్‌బీర్-అలియా గోవా ఎందుకెళ్లారు?