ఓ కథానాయకుడు నటించాల్సిన చిత్రంలో మరో హీరో నటించడం సహజం. ఇందుకు ఎన్నో కారణాలుండొచ్చు. ప్రముఖ నటులు రామ్ చరణ్, నాని విషయంలో ఒకప్పుడు ఇదే జరిగింది. గతంలో చెర్రీ నటించాల్సిన ఓ ప్రేమకథలో నాని నటించి యువత హృదయాల్ని హత్తుకున్నాడు. అదే సినిమా అంటే? 'ఎటో వెళ్లిపోయింది మనసు'.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముందుగా చెర్రీని కథానాయకుడిగా అనుకున్నారట. డేట్స్ సర్దుబాటు కాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా తిరస్కరించాడట చరణ్. దాంతో ఈ ప్రేమకథలో నటించే అవకాశం నానిని వరించింది. నానికి కథ బాగా నచ్చడం వల్ల ఓకే చేశాడు. అలా 'ఎటో వెళ్లిపోయింది మనసు' అంటూ సమంతను ఉద్దేశించి 'ప్రియమతా నీవచట కుశలమా' పాటను అందుకున్నాడు.
ఇదీ చూడండి.. 'సామజవరగమన..' పాటకు కేటీఆర్ ఫిదా