పూరీజగన్నాథ్ అంటేనే విభిన్న చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరుంది. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ హీరోలచేత సిక్స్‌ప్యాక్ చేయించి.. చొక్కాలు విప్పించిన ఘనత కూడా పూరీదే. ముందు అల్లుఅర్జున్, తర్వాత ప్రభాస్, జూ.ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్.. తాజాగా ఈ లిస్టులో హీరో రామ్ కూడా చేరాడు. 'ఇస్మార్ట్ శంకర్' చిత్రంలో చొక్కా విప్పి కండలు చూపిస్తున్నాడీ హీరో.

జిమ్‌లో శ్రమించి వీ షేప్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు రామ్. ప్రస్తుతం రామ్ ఇస్మార్ట్‌శంకర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా మే లో ప్రేక్షకులు ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథే స్వయంగా నిర్మిస్తున్నారు.'

'దేశముదురు' సినిమాలో అల్లు అర్జున్‌తో తొలిసారి చొక్కా విప్పించాడీ సంచలన దర్శకుడు. అలాగే 'బుజ్జిగాడు'లో ప్రభాస్ పలకల దేహాన్నీ చూపించాడు. 'టెంపర్'లో జూనియర్ ఎన్టీఆర్, 'ఇజం'లో కల్యాణ్‌రామ్ చేత సిక్స్‌ప్యాక్ చేయించి ఆశ్చర్యపరిచాడు పూరీ. ప్రస్తుతం హీరో రామ్ పూరీ కోసం చొక్కా విప్పేస్తున్నాడు. మరీ కండల దేహం రామ్‌కు ఏ మేరకు ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి.