రామ్‌చరణ్-శంకర్(ram charan shankar movie) కలయికలో రూపొందుతున్న సినిమా ప్రారంభం కానుంది. ఈ నెల 22న పుణెలో షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే కొబ్బరికాయ కొట్టిన ఈ చిత్రం.. తొలి షెడ్యూల్ 20 రోజులపాటు సాగనున్నట్టు తెలిసింది. పాటతో చిత్రీకరణ మొదలవనుంది. ఆ విషయాన్ని హీరోయిన్ కియారా అడ్వాణీ(kiara advani movies) స్వయంగా వెల్లడించారు.
శంకర్ సినిమాల్లో(shankar movies) పాటలకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. భారీ హంగులతో సెట్స్ తీర్చిదిద్ది అందులో షూటింగ్ చేస్తుంటారు. ఇందులోని పాటల్నీ అదే తరహాలో తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్‌చరణ్(ram charan movie list) యువ ఐఏఎస్ అధికారిగా కనిపిస్తారని సమాచారం. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు.
ఇవీ చదవండి: