*మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సెట్లో రామ్‌చరణ్ సందడి చేశారు. ఆ ఫొటోను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. చరణ్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారని దర్శకుడు కొరటాల శివ ఈ మధ్యే వెల్లడించారు. వచ్చే వేసవికి థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.
*'సామ్ జామ్' టాక్ షోకు అల్లు అర్జున్ హాజరైన ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తండ్రి అయిన తర్వాత ఇంట్లో బూతులు మాట్లాడటం తగ్గించేశానని అన్నారు. ఈ ఎపిసోడ్ జనవరి 1 నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
*దర్శకుడు గుణశేఖర్ తీస్తున్న 'శాకుంతలం' అప్డేట్స్.. జనవరి మొదటి వారం నుంచి రానున్నాయి. ఓ అజరామరమైన ప్రేమకథతో సినిమా తీస్తున్నారు. అయితే ప్రధాన పాత్రలో సమంత నటించనుందని సమాచారం.
*యువ నటుడు సందీప్ మాధవ్ 'గంధర్వ' సినిమా.. ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వివి వినాయక్, క్రిష్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జవహర్ రెడ్డి ఈ చిత్రానికి డైరెక్టర్. త్వరలో షూటింగ్ ప్రారంభించనున్నారు.
*'ఫాదర్ చిట్టి ఉమ కార్తిక్' సినిమాలోని చిట్టి పాత్రలో నటిస్తున్న చిన్న పిల్ల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు.

- " class="align-text-top noRightClick twitterSection" data="">



