ETV Bharat / sitara

'ఎవడు' దర్శకుడితో మరోసారి చరణ్! - Ram charam Vamsi Paidipalli

మెగా పవర్​స్టార్ రామ్​చరణ్ మరోసారి వంశీ పైడిపల్లితో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని సమాచారం.

చరణ్
చరణ్
author img

By

Published : Apr 12, 2020, 7:18 PM IST

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'​లో నటిస్తున్నాడు. తాజాగా మరో సినిమా చేసేందుకు అంగీకరించాడని సమాచారం. మహేశ్​ బాబుతో 'మహర్షి'ని తెరకెక్కించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడని తెలుస్తోంది. వీరిద్దరూ ఇంతకుముందే 'ఎవడు' సినిమాకు కలిసి పనిచేశారు. మంచి విజయాన్ని అందుకుంది ఆ చిత్రం.

వంశీ పైడిపల్లి మహేశ్​తో తెరకెక్కించిన 'మహర్షి' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తన తర్వాతి సినిమా కూడా మహేశ్​తో చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల అది ఆలస్యమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'​లో అల్లూరి సీతారామరాజుగా చరణ్ కనిపించనున్నాడు. కుమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఆలియా భట్, ఒలివియా హీరోయిన్లు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.