ETV Bharat / sitara

ఇద్దరు స్టార్​హీరోల సినిమాలో పైలట్​గా రకుల్ - పైలట్ రోల్​లో రకుల్​

కొంతకాలంగా బాలీవుడ్​పై దృష్టిసారించిన సొగసరి భామ రకుల్​ ప్రీత్​ సింగ్​.. మరో ఆఫర్​ కొట్టేసింది. ఈసారి అమితాబ్​, అజయ్​ దేవగణ్​ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న సినిమాలో కనువిందు చేయనుంది.

rakul preet singh news
ఇద్దరు స్టార్​ హీరోల సినిమాలో పైలట్​గా రకుల్
author img

By

Published : Nov 19, 2020, 8:14 PM IST

'బిగ్​ బి' అమితాబ్‌ బచ్చన్​ కథానాయకుడుగా ప్రముఖ నటుడు అజయ్‌ దేవగణ్‌ ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తూనే.. ఓ ముఖ్య పాత్రలోనూ కనిపించనున్నారు అజయ్‌. ఆయన పైలట్ రోల్​లో ఆకట్టుకోనున్నారు. తాజాగా నాయిక వివరాలు వెల్లడించింది చిత్రబృందం. అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవుతోంది. కో పైలట్‌గా దర్శనమివ్వనుంది.

"అమితాబ్‌తో నటించాలనే నా కల నెరవేరబోతుంది. అజయ్‌ దేవగణ్‌ నన్ను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. చిత్రీకరణ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని ట్వీట్‌ చేసింది రకుల్‌. ఈ డిసెంబరులో హైదరాబాద్‌లో షూటింగ్‌ మొదలవుతుంది. థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'మేడే' అనే టైటిల్‌ ఖరారు చేశారు.

రెండోసారి అజయ్‌ దర్శకత్వం

అజయ్‌ దేవగణ్‌కు దర్శకత్వం చేయడం కొత్తేమీ కాదు. 2008లో 'యు మీ ఔర్‌ హమ్‌' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో కాజోల్‌ కథానాయిక. ఈ సినిమాకు రచన, నిర్మాణ బాధ్యతలను కూడా అజయ్‌ చూసుకున్నారు. ఇప్పుడు 'మేడే' కోసం మరోసారి యాక్షన్​ చెప్పబోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.