లాక్డౌన్ కారణంగా థియేటర్లు తెరుచుకోవడం లేదు. దీంతో చాలావరకు సినిమాలు ఓటీటీలో విడుదలవుతూ, ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. దీంతో చిన్ననటీనటులే కాకుండా స్టార్ యాక్టర్స్ కూడా ఓటీటీల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' సమంత ఆకట్టుకోగా, మరికొందరు భామలు ఈ బాటలో వెళ్లేందుకు సిద్ధమవతున్నారు.
![Rakul preet focus on OTT career](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12366743_rakul-2.jpg)
ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులోనూ రకుల్ చేసిన చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఓటీటీ సంస్థలు ఈమెతో రెండు ప్రాజెక్టుల విషయమై చర్చలు జరుపుతున్నాయట. ఈ విషయంపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది.
ఇవీ చదవండి: