సూపర్‌స్టార్ రజనీకాంత్.. దాదాపు ఏడాది విరామం తర్వాత సెట్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 'అన్నాత్త' చిత్రంలో నటిస్తున్న ఆయన.. గతేడాది కరోనా లాక్డౌన్ వల్ల షూటింగ్‌కు హాజరు కాలేకపోయారు. డిసెంబరులో హైదరాబాద్‌లో తిరిగి మొదలైనా సరే, పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలడం, అనారోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు.
ఇప్పుడు పరిస్థితులు సర్దుకుంటున్న నేపథ్యంలో రజనీకాంత్, త్వరలో సెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై ప్రకటన చేయనున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్, ఖుష్బూ, మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతమందిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దీపావళి కానుకగా ఈ ఏడాది నవంబరు 4న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.
ఇది చదవండి: నిజ జీవితంలోనూ రజనీ మారువేషాలు.. ఎందుకంటే?