ETV Bharat / sitara

'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత రాజమౌళి చిత్రమిదేనా.? - rajamouli next movie cinema script ready

దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్'​ తర్వాత మరో సినిమా కోసం ప్రణాళిక రచించేశాడట. ఇప్పటికే కథ కూడా సిద్ధమైందని సినీ వర్గాల సమాచారం. తెలుగు కథానాయకులతో మల్టీస్టారర్​ రూపంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

rajamouli
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Feb 17, 2020, 8:25 AM IST

Updated : Mar 1, 2020, 2:19 PM IST

అగ్ర దర్శకుడు రాజమౌళికి కథల కొరతే ఉండదు. ఆయన ఇంట్లోనే బోలెడన్ని కథలు సిద్ధమైపోతుంటాయి. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ మంచి సినీ రచయిత. ఇతడి కలం నుంచి జాలువారిన స్టోరీలే బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతుంటాయి. ఆయనే రాజమౌళి కోసమూ కథలు సిద్ధం చేస్తుంటాడు. తాజాగా తన తండ్రి రాసిన ఓ స్టోరీతోనే తర్వాత సినిమా తీయాలనుకుంటున్నాడట జక్కన్న.

అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత సినిమాకి ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైందని, అది కూడా మల్టీస్టారర్‌ చిత్రంగానే రూపొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి సినిమా స్థాయి మరింత పెరిగింది. ఆయన ప్రతి చిత్రం పాన్‌ ఇండియా రేంజ్​లో రూపొందుతోంది. తాజా సమాచారం ప్రకారం తర్వాత చిత్రంలోనూ తెలుగు కథానాయకులే నటించబోతున్నారని సమాచారం. వచ్చే సంక్రాంతికి 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి: దేవరకొండ సెంటిమెంట్ బ్రేక్ అయిందిగా​..!

Last Updated : Mar 1, 2020, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.