ETV Bharat / sitara

రాధేశ్యామ్ 'ఇండియన్​ టైటానిక్' అవుతుందా..?

Radhe Shyam Release Date: దేశంలో ప్రస్తుతం ఎటు చూసినా ప్రభాస్ 'రాధేశ్యామ్' మానియానే కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్​లో ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ, విజువల్స్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి లవ్ స్టోరీ ప్లస్ షిప్.. ఫార్ములాతో వరల్డ్​ బిగ్గెస్ట్​ హిట్​గా నిలిచిన టైటానిక్​ను 'రాధేశ్యామ్' మరిపించనుందా..?

radheshyam
రాధేశ్యామ్
author img

By

Published : Mar 8, 2022, 9:22 PM IST

Radhe Shyam Release Date: లవ్​స్టోరీ + షిప్ ఎపిసోడ్​​.. అనగానే వరల్డ్ బిగ్గెస్ట్ హిట్​ 'టైటానిక్​' సినిమానే అందరికీ గుర్తొస్తుంది. మరి మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన ప్రభాస్ 'రాధేశ్యామ్​'.. ఆ టైటానిక్​ను మరిపించనుందా..? 'ఇండియన్​ టైటానిక్'​గా సరికొత్త అధ్యయనాన్ని లిఖించనుందా..? ఏమో మరి.. ట్రైలర్​లోని విజువల్స్ చూస్తే మాత్రం ఈ అనుమానం రాకుండా ఉండదు. ముఖ్యంగా ఇటీవల రిలీజైన రెండో ట్రైలర్​లోని విజువల్స్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.

radheshyam
.
radheshyam
.
radheshyam
.

అవును.. రెండు నెలల క్రితం వరకూ.. ఈ సినిమాపై ఎవరికీ అంచనాలు పెద్దగా లేవు. కానీ ఎప్పుడైతే టీజర్​, ట్రైలర్స్​ రిలీజయ్యాయో ఆ క్షణం నుంచే.. ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. అంతేకాక.. ఈ సినిమా క్లైమాక్స్ కోసం డైరెక్టర్​ రెండేళ్ల కష్టపడ్డారని ఇటీవల ప్రభాస్​ ఓ ప్రెస్​మీట్​లో చెప్పడం.. టైటానిక్​ను మించి ఈ మూవీ క్లైమాక్స్​ ఉండబోతుందని సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ చెప్తున్నవి చూస్తే.. రాధేశ్యామ్ ఇండియన్ టైటానిక్ అనడంలో సందేహం లేదనిపిస్తుంది.

radheshyam
.
radheshyam
.

అంతేకాక.. ఈ సినిమాలో ప్రభాస్​ విక్రమాధిత్య, ప్రేరణ మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే.. టైటానిక్​లోని జాక్​, రోస్​లను మరిపించేలా ఉంది. మరి డైరెక్టర్​ రాధాకృష్ణ సినిమాను టైటానిక్​ లానే దృశ్యకావ్యంలా తీర్చిదిద్దాడా? లేదా? తెలియాలంటే ఇంకో రెండు రోజులు ఆగాల్సిందే..

radheshyam
.

యూఎస్​ గ్రాండ్ రిలీజ్..

ఇక ఈ చిత్రం అమెరికాలో గ్రాండ్​గా రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 10న రికార్డు స్థాయిలో ప్రీమియర్​ షోలు ప్రదర్శన కానున్నాయి. 1,116 లోకేషన్లలో 11,116 షోలు వేయనున్నారు. అడ్వాన్స్​ బుకింగ్స్​ కూడా రికార్డు స్థాయిలో అవుతున్నట్లు తెలిసింది. రొమాంటిక్ లవ్​స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్​ విక్రమాధిత్యగా, పూజాహెగ్డే ప్రేరణగా అలరించనున్నారు.

radheshyam
.

దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్​​ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి:

ప్రభాస్​ను అలా చూసి ఆశ్చర్యపోయా: నటి భాగ్యశ్రీ

'రాధేశ్యామ్​' ఫస్ట్​ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

'క్లైమాక్స్ ఎపిసోడ్​ కోసమే రెండేళ్లు కష్టపడ్డాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.