Radhe Shyam Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్' చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేకంగా వీక్షించినట్లు సామాజిక మాధ్యమాల్లో తెగ వార్తలు వస్తున్నాయి. అంతేకాక.. ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిని దృష్టిలో పెట్టుకుని సినిమాలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.
![Ahead of release](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/c3707765491c47a689ea4dec6f126b9f_0903newsroom_1646826974_814.jpg)
మరోవైపు 'రాధేశ్యామ్' ప్రొమోషన్స్లో భాగంగా.. ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి కలిసి ఓ ప్రొమోషనల్ వీడియో చేసినట్లు తెలుస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్- గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఒక్క ఫైట్ కూడా లేని 'రాధేశ్యామ్'.. అందరినీ అలరిస్తుందా?