ETV Bharat / sitara

'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ హైలెట్స్.. ఓటీటీలో 'బ్రో డాడీ' సినిమా - కృతిశెట్టి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒకే ఒక జీవితం, బ్రో డాడీ, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

Radhe shyam pre release event
రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్
author img

By

Published : Dec 29, 2021, 5:18 PM IST

Radhe shyam pre release event: ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో డిసెంబరు 23న 'రాధేశ్యామ్' ప్రీ రిలీజ్ ఈవెంట్​ గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకలో ప్రభాస్​తో సినిమాలు చేయబోయే పలువురు దర్శకుడు పాల్గొన్నారు. అలానే ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు కూడా విచ్చేశారు. ఎంతో సందడిగా సాగిన ఈ ఈవెంట్​ హైలెట్స్​ వీడియోను నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​ బుధవారం విడుదల చేసింది. మీరు మరి ఓ లుక్కేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా చేసింది. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించారు. రాధాకృష్ణ కుమార్ దర్శకుడు. జనవరి 14న 'రాధేశ్యామ్'.. థియేటర్లలోకి రానుంది.

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం'. టైమ్ ట్రావెల్​ కథతో తీస్తున్న ఈ సినిమా టీజర్​ను హీరో సూర్య, బుధవారం విడుదల చేశారు. ఆద్యంతం అలరిస్తున్న ఈ టీజర్.. సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో అక్కినేని అమల, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్​గా నటిస్తుంది. శ్రీ కార్తిక్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

Krithi shetty: సుధీర్​బాబు, కృతిశెట్టి జంటగా నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రానికి సహకారమందించేందుకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ముందుకొచ్చేసింది. ఇటీవలే 'పుష్ప'తో హిట్​ అందుకుందీ మైత్రీమూవీ మేకర్స్.

sudheer babu krithi shetty movie
సుధీర్ బాబు -కృతిశెట్టి మూవీ

ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్​కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా తీస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Bro daddy movie OTT: మలయాళ స్టార్ హీరోలు మోహన్​లాల్-పృథ్వీరాజ్ నటిస్తున్న 'బ్రో డాడీ' సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం బుధవారం వెల్లడిస్తూ, కొత్త పోస్టర్​ రిలీజ్ చేసింది. ఇందులో సూట్​లతో నిల్చుని ఉన్న మోహన్​లాల్-పృథ్వీరాజ్ స్టిల్ ఆకట్టుకుంటోంది.

bro daddy movie
బ్రో డాడీ మూవీ

ఈ సినిమాలో నటిస్తున్న పృథ్వీరాజ్.. డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఇప్పటికే వీరి కాంబినేషన్​లో వచ్చిన 'లూసిఫర్'.. అద్భుత విజయం సొంతం చేసుకుంది. దీనిని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'గాడ్​ఫాదర్' పేరుతో సినిమా కూడా తీస్తున్నారు.

'సేనాపతి' సినిమాతో డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకు రానున్న నరేశ్ అగస్త్య.. మరో సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. అతడు హీరోగా కొత్త చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.

naresh agasthya movie
నరేశ్ అగస్త్య న్యూ మూవీ

ఈ సినిమాలో సంజన సారధి హీరోయిన్​గా చేయనుంది. డాక్టర్ సందీప్ చెగురి దర్శకుడు. భరత్ మంచిరాజు సంగీతమందిస్తున్నారు. త్వరలో ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.