ముద్దుగుమ్మ త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'రంగీ'. హీరోయిన్ ఓరియెంటడ్గా ఈ చిత్రం తీస్తున్నారు. ఆదివారం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో యాక్షన్ సన్నివేశాల్లో అలరించిందీ భామ. మహిళల అక్రమ రవాణా కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది.
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ కథను అందించాడు. సత్య సంగీతమందించాడు. 'జర్నీ' సినిమా ఫేమ్ శరవణన్ దర్శకత్వం వహించాడు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">