ETV Bharat / sitara

అతడిని ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్‌ చేశా: అశ్విన్​ - టీమ్​ఇండియా వర్సెస్​ ఆస్ట్రేలియా

R Ashwin vs Steve Smith: టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. స్టీవ్ స్మిత్, లబుషేన్​లను ఔట్ చేసేందుకు తాను రచించిన ప్రణాళిలను వివరించాడు.

రవిచంద్రన్​ అశ్విన్​ స్టీవ్​ స్మిత్​, ravichandran ashwin steve smith
రవిచంద్రన్​ అశ్విన్​ స్టీవ్​ స్మిత్​
author img

By

Published : Dec 22, 2021, 3:29 PM IST

Updated : Dec 22, 2021, 4:15 PM IST

R Ashwin vs Steve Smith: గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని టీమ్ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ బయట పెట్టాడు. ఆసీస్‌ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ని ఔట్ చేసేందుకు ఆరు నెలలు రీసెర్చ్‌ చేశానని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియా గత ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా తొలిసారిగా టెస్టు సిరీస్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ సిరీస్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అశ్విన్‌ ఇటీవల ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

"ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఆరు నెలలుగా స్టీవ్‌ స్మిత్‌ పైనే పూర్తిగా దృష్టి సారించా. అంతకుముందు అతడు ఆడిన మ్యాచుల ఫుటేజీలు చూసి.. బ్యాటింగ్‌ శైలిని గమనించాను. అతడి ఆలోచన విధానాన్ని, బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. స్మిత్ బ్యాటింగ్‌ ఎక్కువగా హ్యాండ్ మూవ్‌మెంట్‌పైనే ఆధారపడి ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్‌ చేయగలిగితే పై చేయి సాధించినట్లే. ఈ ట్రిక్‌ ఆధారంగానే వైవిధ్యమైన బంతులేసి అతడిని ఔట్ చేయగలిగాను. అలాగే, ఆసీస్‌కు చెందిన మరో ఆటగాడు మార్నస్ లబూషేన్‌ను ఔట్ చేసేందుకు కూడా ప్రత్యేక వ్యూహాలు రచించాను. ఫీల్డ్‌లో వాటిని అమలు చేసి ఫలితం రాబట్టాను."

-రవి అశ్విన్, టీమ్ఇండియా స్పిన్నర్

కపిల్‌ దేవ్‌ రికార్డుకు చేరువైన అశ్విన్‌

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (417 వికెట్లు) రికార్డును బద్దలు కొట్టిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ (427 వికెట్లు)‌ తాజాగా మరో రికార్డుకు చేరువయ్యాడు. మాజీ ఆల్‌ రౌండర్ కపిల్ దేవ్‌ (434 వికెట్లు) రికార్డుకు 8 వికెట్ల దూరంలో ఉన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఈ రికార్డును అధిగమించే అవకాశం ఉంది. కపిల్ దేవ్‌ రికార్డును అశ్విన్‌ బద్దలు కొడితే.. టెస్టు ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కనున్నాడు. భారత్ తరఫున మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619 వికెట్లు) తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇదీ చూడండి: IND vs SA Series: టీమ్ఇండియా ఈ పదకొండు మందితో!

Last Updated : Dec 22, 2021, 4:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.