ETV Bharat / sitara

'పుష్ప' మేకింగ్​ వీడియో​.. ఓటీటీలో 'బంగార్రాజు'.. సల్మాన్​తో వెంకీ! - టాలీవుడ్​ అప్​డేట్స్​

'పుష్ప' విజయం జోష్​ మీద ఉన్న బన్నీ ఫ్యాన్స్​ కోసం ఓ స్పెషల్​ వీడియోను పోస్ట్​ చేసింది చిత్రబృందం. కాగా, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంబంధిత ఓటీటీ సంస్థ వెల్లడించింది.

Pushpa making video
పుష్ప మేకింగ్ వీడియో
author img

By

Published : Feb 9, 2022, 5:37 PM IST

'పుష్ప.. పుష్పరాజ్​.. తగ్గేదేలే..' అంటూ అభిమానులను అలరించారు ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్. పుష్ప చిత్రంలోని బన్నీ మేనరిజానికి ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. తగ్గేదేలే అంటూ ఆయనను అనుసరిస్తూ సోషల్​ మీడియాలో వీడియోలు పెట్టి హల్​చల్​ చేశారు. మరి ఇంత క్రేజ్​ సంపాదించుకున్న ఆ పుష్ప లుక్​ కోసం అల్లు అర్జున్​ను ఎలా తయారుచేశారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ మేకింగ్​ వీడియోను విడుదల చేసింది. దాన్ని మీరూ చూసేయండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సుకుమార్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబరు 17న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులకు స్లో పాయిజన్​లా ఎక్కేసింది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను అందుకుంది.

ఓటీటీలోకి బంగార్రాజు ఎంట్రీ..

నాగార్జున, నాగచైతన్య కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'బంగార్రాజు'. కల్యాన్​కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. సంక్రాంతి విన్నర్​గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని జీ5 తెలుగు ప్రకటించింది. ఈనెల 18 నుంచి బంగార్రాజు స్ట్రీమింగ్​ కానున్నట్లు తెలిపింది. 'సోగ్గాడే చిన్ని నాయనా'కు సీక్వేల్​గా వచ్చిన ఈ సినిమాలో రమ్యకృష్ణ, కృతిశెట్టి, రావురమేశ్ తదితరులు నటించారు.

లైగర్​ నాన్​ థియేట్రికల్​ రైట్స్​..

విజయ్​ దేవరకొండ కథనాయకుడిగా పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్​ ఇండియా చిత్రం 'లైగర్​'. అనన్య పాండే కథనాయికగా నటిస్తున్న ఈ చిత్రంతో విజయ్​.. బాలీవుడ్​కు పరిచయం కానున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర అప్​డేట్​ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నాన్​ థియేట్రికల్​ రైట్స్​ను అమెజాన్​ ప్రైమ్​ రూ.60 కోట్లు వెచ్చించి దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను పూరీ జగన్నాథ్​, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సల్మాన్​ చిత్రంలో వెంకీ?

టాలీవుడ్​లో ఫ్యామిలీ డ్రామాల్లో తనదైన ముద్ర వేసిన విక్టరీ వెంకటేశ్​ ఇప్పుడు బాలీవుడ్​లోకి అడుగుపెట్టనున్నారట. సాజిద్​ నదియావాలా దర్శకత్వంలో స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ నటిస్తున్న చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర కోసం వెంకీని సంప్రదించినట్టు సమాచారం. 'భాయ్​ జాన్​'గా పేర్కొంటున్న ఈ సినిమా షూటింగ్​ మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. వెంకీ నటించిన మూడో బాలీవుడ్​ సినిమా అవుతుంది. అంతకుముందు.. అనారి, తక్​ధీర్​వాలా చిత్రాల్లో నటించారు వెంకటేశ్.

ఇదీ చూడండి : రామ్​చరణ్-శంకర్ సినిమా కథ.. ఆ స్టార్ డైరెక్టర్​ది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.