Project K Movie: పాన్ఇండియా స్టార్ ప్రభాస్ కోసం హాలీవుడ్లో ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్. ఇలాంటిది గతంలో ఏ భారత నటుడికీ జరగలేదని వెల్లడించారు. ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై దత్ నిర్మాణంలో 'ప్రాజెక్ట్ కే' చిత్రం తెరకెక్కుతుంది. నాగ్ అశ్విన్ దర్శకుడు. దీపిక పదుకొణె హీరోయిన్. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా గురించి ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు అశ్వనీదత్.
"హాలీవుడ్ నటులు, దర్శకులు.. ఒక భారత యాక్టర్ కోసం ఇంత ఎంక్వైరీ చేయడం ఎవ్వరికీ జరగలేదు. ప్రభాస్‌కు జరిగింది. నేను కచ్చితంగా చెప్పగలను.. 'ప్రాజెక్ట్ కే' తర్వాత ప్రభాస్.. కేవలం ఇంగ్లీష్ సినిమాలు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు."
- అశ్వనీదత్, నిర్మాత
రిలీజ్ ఎప్పుడంటే?
-
𝑰𝒏𝒅𝒊𝒂'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒔𝒖𝒑𝒆𝒓𝒔𝒕𝒂𝒓𝒔 #Prabhas & @deepikapadukone 𝒋𝒐𝒊𝒏 𝒉𝒂𝒏𝒅𝒔 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒘𝒐𝒓𝒍𝒅'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒄𝒂𝒎𝒆𝒓𝒂... #ProjectK @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/nRjsJYVMDc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝑰𝒏𝒅𝒊𝒂'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒔𝒖𝒑𝒆𝒓𝒔𝒕𝒂𝒓𝒔 #Prabhas & @deepikapadukone 𝒋𝒐𝒊𝒏 𝒉𝒂𝒏𝒅𝒔 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒘𝒐𝒓𝒍𝒅'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒄𝒂𝒎𝒆𝒓𝒂... #ProjectK @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/nRjsJYVMDc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 11, 2021𝑰𝒏𝒅𝒊𝒂'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒔𝒖𝒑𝒆𝒓𝒔𝒕𝒂𝒓𝒔 #Prabhas & @deepikapadukone 𝒋𝒐𝒊𝒏 𝒉𝒂𝒏𝒅𝒔 𝒐𝒏 𝒕𝒉𝒆 𝒘𝒐𝒓𝒍𝒅'𝒔 𝒃𝒊𝒈𝒈𝒆𝒔𝒕 𝒄𝒂𝒎𝒆𝒓𝒂... #ProjectK @SrBachchan @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/nRjsJYVMDc
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) December 11, 2021
ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు నాగ్అశ్విన్ దాదాపు రెండున్నర ఏళ్లు కష్టపడినట్లు చెప్పారు అశ్వనీదత్. "ఇప్పటికే రెండు షెడ్యూళ్ల చిత్రీకరణ పూర్తైంది. గ్రాఫిక్స్ వర్క్ స్టార్ట్ అయ్యింది. 2023 ఏప్రిల్ లేదా మేలో సినిమాను విడుదలను చేయాలని భావిస్తున్నాం. అయితే ఒమిక్రాన్ ప్రభావం వల్ల విడుదల రెండు మూడు నెలలు అటు ఇటూ కావొచ్చు." అని దత్ వెల్లడించారు.
మరో 50 ఏళ్లు గుర్తుండిపోయే సినిమా..
"ఈ సినిమా తొలి రోజే నన్ను అమితాబ్ బచ్చన్ ఆశీర్వదించారు. 'పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలైంది. నాకు తెలిసి ఈ సినిమా.. ఇంకో 50 సంవత్సరాలు ప్రేక్షకులకు గుర్తుంటుంది' అని అమితాబ్ నాతో అన్నారు." అని అశ్వనీదత్ తెలిపారు.
ఇదీ చూడండి: ప్రభాస్ మరో ఘనత.. దక్షిణాది నుంచి ఒకే ఒక్కడు!