ETV Bharat / sitara

''భీమ్లా నాయక్​'లో పవన్ విశ్వరూపం చూస్తారు' - bheemla nayak news

Bheemla nayak movie: 'భీమ్లా నాయక్' గురించి అదిరిపోయే విషయాలు వెల్లడించారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాలో పవన్ విశ్వరూపం చూస్తారని, ఫ్యాన్స్​ పండగ చేసుకునే వార్త చెప్పారు.

pawan kalyan bheemla nayak
పవన్ కల్యాణ్
author img

By

Published : Feb 11, 2022, 11:27 AM IST

Pawan kalyan bheemla nayak release date: పవర్​స్టార్ పవన్​ కల్యాణ్ 'భీమ్లా నాయక్' రిలీజ్​పై త్వరలో క్లారిటీ వస్తుందని నిర్మాత నాగవంశీ చెప్పారు. కొవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత థియేటర్లలోకి తీసుకొస్తామని అన్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఓ వెబ్ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని వంశీ వెల్లడించారు.

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్' సినిమాకు రీమేక్​ 'భీమ్లా నాయక్'. అయితే తెలుగులో తీయాలని ఫిక్స్ కాగానే కథతో మార్పులు చేశామని నిర్మాత నాగవంశీ అన్నారు. మొత్తం బాధ్యత త్రివిక్రమ్ తీసుకున్నారని వంశీ చెప్పారు. ఇందులో పవన్​ విశ్వరూపం చూస్తారని, ఫ్యాన్స్ పండగ చేసుకునేలా సినిమా ఉంటుందని చెప్పారు.

producer naga vamsi
నిర్మాత నాగవంశీ

గతంలో ప్రకటించి ఆగిపోయిన ఎన్టీఆర్​తో సినిమా గురించి కూడా వంశీ క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు నిలిచిపోలేదని, దానిని పాన్ ఇండియా రేంజ్​లో భారీస్థాయిలో తెరకెక్కించే ఆలోచని ఉందని అన్నారు. అందుకు కొన్నాళ్ల సమయం పట్టనుందని చెప్పారు.

అలానే పవన్ కల్యాణ్​​తో మరో సినిమా చేస్తామని వంశీ చెప్పారు. మెగా హీరో రామ్​చరణ్​తో సినిమా చేయాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.