'తగ్గేదే లే' అంటూ మాస్ లుక్‌తో పుష్పరాజ్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొంతకాలంగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని భావిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్.
"ఈ సినిమా కథ చాలా పెద్దగా ఉంటుంది. 2.30 గంటల్లో పూర్తి స్టోరీ చెప్పడం కుదరదు. అందువల్ల దర్శకుడు, హీరో సహకారంతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించాం. మొదట పార్ట్‌కు సంబంధించి ఇంకా 40 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. అలాగే రెండో భాగం 10 శాతం చిత్రీకరణ ఇప్పటికే పూర్తి చేసుకుంది. బడ్జెట్ కూడా పెంచాం. ముందుగా రూ. 160 కోట్లుగా ఉన్న బడ్జెట్ ప్రస్తుతం రూ.250 కోట్లకు చేరింది" అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు రవిశంకర్.
ప్రముఖ దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. సుకుమార్-బన్నీ-దేవిశ్రీ ప్రసాద్ కాంబోలో రానున్న మూడో చిత్రమిది. రష్మిక కథానాయిక. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">