ETV Bharat / sitara

'బాలకృష్ణను ఆ పాత్రలో చూడాలనేది చాలా మంది కోరిక' - రామానుజ చార్యులు బాలకృష్ణ

Balakrishna C Kalyan Movie: బాలకృష్ణతో తన కలల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉందని చెప్పారు నిర్మాత సి.కల్యాణ్‌. రామానుజచార్యులు పాత్రలో బాలయ్యను చూడాలనేది చాలా మంది కోరిక అని పేర్కొన్నారు.

బాలకృష్ణ, balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Dec 9, 2021, 7:32 AM IST

Updated : Dec 9, 2021, 9:12 AM IST

సినిమా టిక్కెట్‌ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిత్రపరిశ్రమలో ఎవ్వరూ సంతోషంగా లేరన్నారు ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌. ఆ సమస్య పరిష్కారం కోసం పరిశ్రమ తరఫున మేమంతా కలిసి మరోసారి ప్రభుత్వానికి విన్నవించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. సత్యదేవ్‌ కథానాయకుడిగా 'గాడ్సే' సినిమాను నిర్మిస్తున్న సి.కల్యాణ్‌ పుట్టినరోజు గురువారం. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. 'గాడ్సే' సినిమాను ఓ పీరియాడిక్‌ డ్రామాతో రూపొందించామని, జనవరి 26న విడుదలకి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

"ప్రభుత్వాల్ని ప్రశ్నించే అంశాలతో సాగే చిత్రమిది. అందరి సమస్యలూ ఈ కథలో ప్రతిబింబిస్తాయి. గాడ్సే పాత్ర వింతగా ఉంటుంది. అమ్మానాన్నలు కష్టపడి చదివిస్తే, ఏదో చేద్దామని కలలు కన్న యువత ఏమీ చేయలేని పరిస్థితులతో ఎలా సతమతమవుతుందో ఇందులో చక్కగా ఆవిష్కరించారు దర్శకుడు. దీన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నా. సత్యదేవ్‌కు చాలా మంచి పేరు వస్తుంది. ఈ చిత్రం తర్వాత దర్శకుడు గోపీగణేష్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌ను తీస్తా. సత్యదేవ్‌తోనూ ఓ సినిమా ఉంటుంది" అన్నారు సి.కల్యాణ్‌. ఆయన చిత్ర పరిశ్రమ సమస్యలపై మాట్లాడుతూ "టిక్కెట్‌ ధరల్ని తగ్గించి ప్రజలకి మేలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనుకోవచ్చు. మరీ ఇంతగా తగ్గించడం భావ్యం కాదు. నా వస్తువుని నేను తయారు చేసుకుని, నేనే ధరని నిర్ణయించుకుంటా. ఆ వస్తువుని కొనాలా? వద్దా? సినిమాని చూడాలా వద్దా? అనేది ప్రేక్షకుల ఇష్టం" అన్నారు.

బాలకృష్ణతో రామానుజా చార్యులు

Balakrishna C Kalyan Movie: బాలకృష్ణతో ఆయన కలల ప్రాజెక్ట్‌ను నిర్మించాలని ఉందని చెప్పారు సి.కల్యాణ్‌. "రామానుజచార్యులు పాత్రలో బాలకృష్ణని చూడాలనేది చాలా మంది కోరిక. ఆయనకీ ఆ సినిమా చేయాలని ఉంది. 'రూలర్‌' తర్వాత మా కలయికలో మరో సినిమా రావాలి. వరుసగా మూడు ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు బాలకృష్ణ. ఆయన ఎప్పుడంటే అప్పుడు మా సంస్థలో సినిమా ఉంటుంద"ని చెప్పారు.

ఇదీ చూడండి: Akhanda Sequel: బాలయ్య 'అఖండ'కు సీక్వెల్​.. నిజమేనా?

Last Updated : Dec 9, 2021, 9:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.