ETV Bharat / sitara

'సీఎం జగన్.. సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదు' - సినిమా టికెట్ ఇష్యూ

సినిమా వ్యాపారంలో రాజకీయ జోక్యం తగదని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. ఏపీ సీఎం జగన్ ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

c kalyan cm jagan
జగన్ సి.కల్యాణ్
author img

By

Published : Dec 9, 2021, 3:24 PM IST

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్​కు తన రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఎక్కువైందని అన్నారు. సినీ పరిశ్రమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నిర్మాత సి.కల్యాణ్

అయితే ఇటీవల సినీ పరిశ్రమలో టికెట్ ధరల అంశంపై సీఎం జగన్​తో సినీ పెద్దల వ్యవహారం సరైన విధంగా లేదని సి.కల్యాణ్ అన్నారు. సినిమా వ్యాపారంలో రాజకీయ జోక్యం తగదని అభిప్రాయపడ్డారు.

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి అగ్ర నటులు జోక్యం చేసుకుని ఈ వివాదానికి ముగింపు పలకాలని సి.కళ్యాణ్ డిమాండ్ చేశారు. సినిమా టికెట్లను సినిమా వాళ్లే అమ్ముకునేలా చొరవ చూపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.