ETV Bharat / sitara

'నాగ్​ అశ్విన్​ మరో బయోపిక్ తీయడు​' - నాగ్​ అశ్విన్ మరో బయోపిక్​ తీయడు

'మహానటి' ఫేం యువ దర్శకుడు నాగ్​ అశ్విన్​ నుంచి మరో బయోపిక్​ రాదని స్పష్టతనిచ్చారు నిర్మాత అశ్వనీదత్​. ఈ విషయాన్ని అతడు​ తనతో చెప్పినట్లు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

nag aswin
నాగ్​ అశ్విన్​
author img

By

Published : May 9, 2020, 5:20 PM IST

దిగ్గజ నటి సావిత్రి జీవితాన్ని 'మహానటి' రూపంలో దృశ్యకావ్యంగా మలిచి తెలుగు తెరపై బయోపిక్స్‌ ట్రెండ్‌కు కొత్త ఊపిరిలూదారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. దీని తర్వాత టాలీవుడ్​లో అనేక జీవితకథలు సందడి చేసినా ఏదీ 'మహానటి' స్థాయికి సరితూగ లేకపోయింది. అయితే ఈ యువదర్శకుడి నుంచి మరో గొప్ప నటి బయోపిక్‌ రాబోతుందని వార్తలు హల్​చల్​ చేస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ స్పష్టతనిచ్చారు.‌ తన అల్లుడు నాగ్‌ అశ్విన్‌ నుంచి మరో బయోపిక్‌ వచ్చే అవకాశం లేదని అన్నారు.

"చాలా మంది శ్రీదేవి బయోపిక్‌ గురించి అడుగుతున్నారు. నా భార్య అయితే నాగీని ఎం.ఎస్‌.సుబ్బలక్ష్మి జీవితగాథ తీయొచ్చు కదా అని అడిగింది. కానీ, తనకిష్టం లేదని అతడు చెప్పాడు. 'సావిత్రి నా అభిమాన నటి. ఆమె సినిమాలు చూస్తూ పెరిగా. ఆమె అంటే అభిమానం. ఆ అభిమానంతోనే బయోపిక్‌ తీశా. అదే నా ఆఖరి జీవితగాథ. లేని ఎమోషన్‌ను కల్పించుకోని మరొకరి బయోపిక్‌ తీయడం చాలా కష్టం' అని నాగీ మాకు చెప్పాడు. కాబట్టి తన నుంచి మరో బయోపిక్‌ ఆశించొద్దు"

- అశ్వనీదత్‌, నిర్మాత

ప్రస్తుతం ప్రభాస్​ 21వ సినిమా పనుల్లో నాగ్​అశ్విన్​ బిజీగా ఉన్నరని చెప్పారు అశ్వనీదత్​. ఈ ఏడాది అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానుంది. 2022 ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : ''జగదేక వీరుడు అతిలోకసుందరి' సీక్వెల్​​ తీసే రిటైరవుతా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.