ETV Bharat / sitara

'వీర వనితల పుట్టుకకు కారణం స్వాతంత్య్ర పోరాటం'

author img

By

Published : Aug 15, 2020, 2:52 PM IST

74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బాలీవుడ్​ నటి ప్రియాంకా చోప్రా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. ఈ క్రమంలోనే స్వేచ్ఛా పోరాటంలో తమ వంతు కృషి చేసిన ఎంతో మంది వీర వనితలను గుర్తు చేసుకుంటూ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసింది.

Priyanka Chopra
ప్రియాంక చోప్రా

దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించిన వీర వనితలను గుర్తు చేసుకుంది బాలీవుడ్​ హీరోయిన్​ ప్రియాంకా చోప్రా. శనివారం దేశవ్యాప్తంగా 74వ స్వాతంత్య్ర వేడుకలు అంబరాన్నంటుతన్న వేళ.. దేశం కోసం తమ జీవితాలనే త్యాగం చేసి చరిత్రలో నిలిచిన మహిళా యోధుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ.. ఇన్​స్టాగ్రామ్​ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేసింది ప్రియాంక.

"వందేమాతరం. వారే మహారాణులు, యోధులు, విప్లవకారులు, దేవ దూతలు, మనకు మద్దతుగా నిలిచేవారు. చాలా మంది నాయకులు కూడా ఉన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం లెక్కలేనంత మంది ద్రుఢమైన, వీర వనితనలకు జన్మనిచ్చింది. ప్రతి ఒక్కరూ ఈ సంగ్రామంలో ప్రత్యేక పాత్ర పోషించారు. వారి త్యాగాలు మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి."

-ప్రియాంకా చోప్రా, సినీ నటి

ఈ ప్రత్యేక వేడుక సందర్భంగా బాలీవుడ్​ ప్రముఖులు అమితాబ్ బచ్చన్​, అనుపమ్​ ఖేర్​, లెజెండ్​ సింగర్​ లతా మంగేష్కర్​, మ్యూజిక్ దిగ్గజం ఏఆర్​ రెహ్మన్​ తదితరులు దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.